Begin typing your search above and press return to search.
టాలీవుడ్: పారితోషికాల విషయంలో కొత్త రూల్?
By: Tupaki Desk | 26 May 2020 12:02 PM ISTగత రెండు నెలలుగా ఆగిపోయిన షూటింగులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. జులై ఆఖరు కల్లా దాదాపు అన్ని సినిమాల షూటింగులు ప్రారంభం అవుతాయనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే నిర్మాతలు షూటింగులకు సంబంధించిన ప్రిపరేషన్స్ మొదలు పెట్టారట. ఇదిలా ఉంటే నటీనటులు.. టెక్నిషియన్ల పారితోషికాల విషయంలో ఓ కీలక మార్పు రానుందని అంటున్నారు.
చాలామంది నిర్మాతలు ఇప్పటికే కొందరు నటీ నటులకు కొంత అడ్వాన్సులు చెల్లించి ఉంటారు. అయితే ఇప్పుడు కొత్తగా వారికి అడ్వాన్సులు ఇవ్వడం లేదా బ్యాలెన్స్ ఎమౌంట్ చెల్లించడం లాంటివి చెయ్యరట. సినిమాకు బిజినెస్ అయితేనే నటీనటులకు డబ్బు చెల్లించాలని నిర్మాతల మండలి ఓ రూల్ తీసుకురాబోతున్నారట. ఒకవేళ ఎవరైనా నటీనటులు ఈ ప్రతిపాదనకు ఒప్పుకోకపోతే వారిని నిర్మాతల మండలి బ్యాన్ చేసేలా ఒక కొత్త రూల్ పెడతారట. నటీనటులకే కాదు.. టెక్నిషియన్లకూ ఇదే రూల్ వర్తిస్తుందని నిర్మాతల మండలి వారు తేల్చి చెప్తున్నారని తెలుస్తోంది.
అయితే ఇది ఎక్కువ రెమ్యూనరేషన్ పుచ్చుకునేవారికి మాత్రమే. రోజుకు ఐదు వేల రూపాయల కంటే తక్కువ రెమ్యూనరేషన్ ఉండేవారికి ఈ రూల్ నుంచి మినహాయింపు ఇస్తున్నారట. మరి ఈ కొత్త రూల్స్ ఎంతకాలం కొనసాగుతాయి అంటే.. ఇండస్ట్రీకి మళ్ళీ మంచి రోజులు వచ్చేవరకూ సినిమాలకు మునుపటిలాగా బిజినెస్ జరిగేవరకూ ఇదే పద్ధతి ఫాలో అవుతారట.