Begin typing your search above and press return to search.

ఆ కామెడీ స్టార్ మూవీ థియేటర్లలోనే విడుదల..మేకర్స్ ప్లాన్

By:  Tupaki Desk   |   9 Nov 2020 3:20 PM IST
ఆ కామెడీ స్టార్ మూవీ థియేటర్లలోనే విడుదల..మేకర్స్ ప్లాన్
X
రాజేంద్రప్రసాద్ తర్వాత ఆ స్థాయిలో కామెడీ సినిమాలు తీసిన హీరోగా అల్లరి నరేష్ పేరు తెచ్చుకున్నాడు. మొదట్లో అన్నీ కామెడీ సినిమాలే చేసిన నరేష్ గమ్యం, శంభో శివశంభో, ప్రాణం, నేను వంటి వైవిధ్యమైన సినిమాలతో తనలోని నటుడిని బయటికి తీశాడు. అన్ని పాత్రలు చేయగలనని నిరూపించుకున్నాడు. కొన్నేళ్లుగా నరేష్ కు సరైన హిట్ లేదు. దీంతో మరోసారి నరేష్ ఓ వైవిధ్యమైన కథాంశాన్ని ఎన్నుకున్నాడు.ఉత్కంఠ భరిత కథాంశంతో ‘నాంది’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాను దర్శకుడు సతీష్ వేగేశ్న నిర్మిస్తుండగా విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఇటీవల విడుదలైన ‘నాంది’ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. బ్రీత్ ఆఫ్ నాంది పేరుతో సినిమా థీమ్ పాయింట్ ఏంటో తెలుపుతూ టీజర్ను రిలీజ్ చేయగా అది ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇది కచ్చితంగా మరోసారి నరేష్ కు మైలురాయి చిత్రంగా నిలుస్తుందని ప్రేక్షకులు అంటున్నారు. గమ్యం శంభో శివశంభో లాగా ప్రత్యేకంగా అతడి కెరీర్ లో నిలుస్తుందని చెబుతున్నారు. అల్లరి నరేష్ కూడా ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు.

వరుస ఫెయిల్యూర్ లతో నిలబడ్డ ఈ హీరో హిట్ కోసం చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరికి విజయం కోసం హారర్ సినిమాలు చేసినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు నాని సినిమా అయినా తనకు మళ్లీ పూర్వవైభవం తెస్తుందని నరేష్ భావిస్తున్నాడు.ముందుగా నాంది సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేస్తారని అనుకున్నప్పటికీ మేకర్స్ ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే థియేటర్ల ప్రారంభానికి అనుమతులు ఇవ్వగా, ఆంధ్రలో కూడా త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ మూవీని థియేటర్లలోనే చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. డిసెంబర్లో తెర మీదికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాందిలో వరలక్ష్మీ శరత్ కుమార్, ప్రియదర్శి కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు