Begin typing your search above and press return to search.
కాస్టింగ్ కౌచ్ ను హీరోయిన్స్ వాడుకుంటున్నారు
By: Tupaki Desk | 4 Oct 2020 6:00 PM ISTబాలీవుడ్ తో పాటు అన్ని భాషల సినిమా పరిశ్రమల్లో కాస్టింగ్ కౌచ్ ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా పరిశ్రమ మొత్తం కూడా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ఉంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ గా వెలుగు వెలుగుతున్న వారు సైతం కాస్టింగ్ కౌచ్ కు బలి అయిన వారే అంటూ ఇండస్ట్రీలో కొందరు అంటున్న మాట. అయితే వారు ఆ విషయాన్ని ఒప్పుకోరు. ఫేడ్ ఔట్ అయిన హీరోయిన్స్ మాత్రమే ఈమద్య కాలంలో కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతున్నారు. కాస్టింగ్ కౌచ్ అనేది లేదంటూ చాలా మంది స్టార్ హీరోయిన్స్ అంటూ ఉంటారు. కాని బయటి నుండి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమయంలో ఎంతో కొంత స్థాయిలో కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొనే ఉంటారు.
ఇటీవల ఈ విషయమై బాలీవుడ్ నటి ఇషా కొప్పికర్ విభిన్నంగా స్పందించింది. కొందరు హీరోయిన్స్ అవకాశాలు దక్కించుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో కాస్టింగ్ కౌచ్ ను ఆశ్రయించాల్సి వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. కాస్టింగ్ కౌచ్ కు నేను వ్యతిరేకం. అందుకే నాకు ఎక్కువ ఆఫర్లు రాలేదు అంటూ స్టార్ హీరోయిన్స్ అయిన వారు అంతా కూడా కాస్టింగ్ కౌచ్ కు ఓకే చెప్పిన వారే అని చెప్పకనే చెప్పింది. ఇక నెపొటిజం గురించి ఈమె మాట్లాడుతూ ఎక్కడ అయిన బంధుప్రీతి ఉంటుంది. ఇండస్ట్రీలో బంధు ప్రీతి కారణంగా చాలా మంది అవకాశాలు కోల్పోతున్నారు. ప్రతిభ ఉన్న హీరోయిన్స్ కు నెపొటిజం వల్ల అవకాశాలు రావడం లేదని ఇషా పేర్కొంది.