Begin typing your search above and press return to search.
కరోనా పరిస్థితుల్లో కూడా బాక్సాఫీస్ పోరుకు సిద్ధంగా ఉన్నట్లున్నారే..!
By: Tupaki Desk | 15 April 2021 9:00 PM ISTకోవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తిని, దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని టాలీవుడ్ లో ఇప్పటికే విడుదల తేదీలని ప్రకటించిన సినిమాలను వాయిదా వేస్తున్నారు. ఏప్రిల్ 16న రావాల్సిన నాగచైతన్య 'లవ్ స్టోరీ'.. ఈ నెల 23న విడుదల కావాల్సిన నాని 'టక్ జగదీష్' - కంగనా రనౌత్ 'తలైవి'.. 30న రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన రానా 'విరాటపర్వం' సినిమాలు వాయిదా పడ్డాయి. అలానే 'ఆచార్య' - 'నారప్ప' వంటి సినిమాల ప్రమోషనల్ కంటెంట్ లో రిలీజ్ డేట్ మెన్షన్ చేయకపోవడాన్ని బట్టి చూస్తే ఇవి కూడా పోస్టుపోన్ అవుతాయనిపిస్తోంది. అయితే 'ఖిలాడి' 'అఖండ' సినిమాలు మాత్రం రిలీజ్ విషయంలో తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తున్నాయి.
నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న ''అఖండ" సినిమాని మే 28న విడుదల చేస్తామని ఆ మధ్య ప్రకటించారు. అలానే మాస్ మహారాజా రవితేజ ''ఖిలాడి'' చిత్రాన్ని కూడా అదే రోజున తీసుకొస్తున్నట్టు పేర్కొన్నారు. ఉగాది సందర్భంగా వదిలిన 'అఖండ' టీజర్ లో.. 'ఖిలాడి' టీజర్ లలో విడుదల తేదీలని కూడా ప్రస్తావించారు. దీనిని బట్టి చూస్తే చెప్పిన సమయానికే రావాలని ఈ రెండు సినిమాల ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద బాలయ్య - రవితేజ పోటీ పడతారా లేదా అనేది రాబోయే రోజుల్లో కరోనా కారణంగా ఏర్పడే పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.