Begin typing your search above and press return to search.

టైటిల్‌ నుండి బాంబ్‌ ను తొలగించారు

By:  Tupaki Desk   |   29 Oct 2020 8:00 PM IST
టైటిల్‌ నుండి బాంబ్‌ ను తొలగించారు
X
తమిళం మరియు తెలుగులో సూపర్‌ హిట్‌ అయిన 'కాంచన' సినిమాను హిందీలో లారెన్స్‌ దర్శకత్వంలో రీమేక్‌ చేశారు. ఇక్కడ లారెన్స్‌ పోషించిన పాత్రను హిందీల బాలీవుడ్‌ కిలాడీ అక్షయ్‌ కుమార్‌ పోషించాడు. ఈ సినిమాకు లక్ష్మీ బాంబ్‌ అనే టైటిల్‌ ను పెట్టడంతో మొదటి నుండి కూడా విమర్శలు వచ్చాయి. ఇటీవలే ఈ సినిమాను డైరెక్ట్‌ గా ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా కారణంగా థియేటర్లు లేకపోవడంతో ఓటీటీ ద్వారా విడుదల అయ్యింది. సినిమా విడుదలైనప్పటి నుండి సోషల్‌ మీడియాలో బ్యాన్‌ లక్ష్మీ బాంబ్‌ అంటూ హ్యాష్‌ ట్యాగ్‌ ను ట్రెండ్‌ చేస్తున్నారు.

సినిమా విడుదలై మూడు వారాలు అయినా కూడా వివాదం సర్దుమనగక పోవడంతో చిత్ర యూనిట్‌ సభ్యులు మరియు డిస్నీ హాట్‌ స్టార్‌ వాళ్లు టైటిల్‌ నుండి బాంబ్‌ ను తొలగించాలనే నిర్ణయానికి వచ్చారు. పేరులో బాంబ్‌ తీసేయడంతో కేవలం లక్ష్మీ అని మాత్రమే ఇకపై ఈ సినిమాను పిలవాల్సి ఉంటుంది. హిందువుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నట్లుగా విమర్శలు రావడం వల్ల టైటిల్‌ ను మార్చినట్లుగా బాలీవుడ్‌ మీడియాతో యూనిట్‌ సభ్యులు మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. ఇప్పటికే సినిమా గురించి జనాలు మర్చి పోతున్నా కూడా కొందరు టైటిల్‌ విషయంలో వివాదం రాజేసి కోర్టు వరకు వెళ్లేందుకు సిద్దం అవ్వడంతో చివరకు టైటిల్‌ ను మార్చాల్సి వచ్చిందట.