Begin typing your search above and press return to search.
ఆ కోణంలో సంక్రాంతి రిలీజ్ లకు ఊరట
By: Tupaki Desk | 27 Sept 2021 12:01 PM IST2022 సంక్రాంతికి బిగ్ ఫైట్ ఖరారైంది. పెద్ద పండగలో పందేనికి బిగ్ స్టార్స్ అంతా తమ చిత్రాలతో పోటా పోటీగా సిద్ధమవుతున్నారు. మునుపెన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో ఈ దఫా భారీ స్థాయిలో పోటీకి దిగుతున్నారు. క్రేజీ స్టార్ ల నుంచి సీనియర్ హీరోల వరకు పోటీపడుతున్నారు. ఇప్పటికే పలువురు క్రేజీ స్టార్‌లు తమ చిత్రాల రిలీజ్ డేట్లని ప్రకటించేసి పోటీని డిక్లేర్ చేసేశారు. ఈ పోటీలో పవన్ - మహేష్ లతో తాను కూడా వున్నానంటూ సీనియర్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ `అఖండ`తో సిద్ధమవుతున్నాడు.
2022 సంక్రాంతి వార్‌లో రసవత్తర పోటీ జరగబోతోంది. ఈ పోటీలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. సూపర్‌స్టార్ మహేష్ బాబు పోటీపడుతున్నారు. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ నటిస్తున్న `భీమ్లా నాయక్` జనవరి 12న విడుదలకు రెడీ అవుతోంది. మలయాళ హిట్ చిత్రం `అయ్యప్పనుమ్ కోషియుమ్` ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. త్రివిక్రమ్ డైలాగ్స్.. స్క్రీన్ ప్లే అందించిన ఈ మూవీలో రానా కూడా నటించడంతో దీనిపై భారీ అంచనాలే వున్నాయి. `సాహో` తరువాత ప్రభాస్ నటిస్తున్న మూవీ `రాధేశ్యామ్`. కె. రాధాకృష్ణకుమార్ అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కించిన ఈ మూవీ వింటేజ్ లవ్‌స్టోరీగా రూపొందింది. పూజూ హెగ్డే.. `మైనే ప్యార్‌కియా` ఫేమ్ భాగ్యశ్రీ నటిస్తుండటంతో ఈ మూవీపై కూడా భారీ అంచనాలే వున్నాయి. ఈ మూవీ జనవరి 13న విడుదల కాబోతోంది. ఇక ఈ రెండు క్రేజీ చిత్రాల తరువాత అంతే క్రేజ్‌ని దక్కించుకున్న చిత్రం `సర్కారు వారి పాట`. సూపర్‌స్టార్ మహేష్ `సరిలేరు నీకెవ్వరు` వంటి బ్లాక్ బస్టర్ తరువాత చేస్తున్న సినిమా ఇది. అంతే కాకుండా యంగ్ డైరెక్టర్ పరశురామ్‌కి అవకాశం ఇవ్వడం.. `పోకిరి` వైబ్స్ కనిపిస్తున్నాయంటూ మహేష్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో వుండటంతో ఈ మూవీ కోసం కూడా భారీ స్థాయిలో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
మహేష్ నటిస్తున్న `సర్కారు వారి పాట` జనవరి 14న అంటే సరిగ్గా సంక్రాంతి రోజు విడుదల కాబోతంంది. ఈ హీరోలతో పాటు సీనియర్ హీరో బాలయ్య కూడా బరిలోకి దిగుతున్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం `అఖండ`. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ మూవీపై కూడా భారీ అంచనాలే వున్నాయి. కారణం బోయపాటి శ్రీను - బాలయ్యలు ముచ్చటగా మూడవ సారి కలిసి చేస్తున్న సినిమా కావడం.. ఇందులో విలన్ గా హీరో శ్రీకాంత్ నటించడం.. మరీ ముఖ్యంగా మొట్టమొదటి సారి బాలయ్య ఇందులో అఘోరాగా కనిపించడం వంటి ప్రత్యేక కారణాలతో ఈ మూవీ హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా ఈ మూవీ ఊరమాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీనుకు అత్యంత కీలంగా మారడంతో చాలా ప్రత్యకతలతో ఈ మూవీని రూపొందించారు.
నటి పూర్ణ కీలక పాత్రలో నటిస్తుండగా.. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమెకి కూడా ఈ మూవీ ఫలితం అత్యంత కీలకం. దీనిపైనే టాలీవుడ్‌లో ఆమె కెరీర్ ఆధారపడి వుంది. సింహా.. లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్‌ల తరువాత బోయపాటి - బాలయ్యల నుంచి వస్తున్న సినిమా ఇది దీంతో వీరిద్దరూ `అఖండ`తో హ్యాట్రిక్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
అయితే సంక్రాంతి బరిలో ఇరుగు పొరుగు భాషల సినిమాలతో పోటీ ఎలా ఉండనుంది? అంటే.. తమిళం నుంచి సంక్రాంతి వార్ లో పలు చిత్రాలు విడుదలయ్యే అవకాశం ఉంది. కానీ చాలా బాలీవుడ్ సినిమాలు క్రిస్మస్ కి లేదా ఫిబ్రవరిలో విడుదలవుతుండడం ఆసక్తికరం. దీనివల్ల సంక్రాంతి బరిలో ఉన్న టాలీవుడ్ చిత్రాలకు పెద్ద పోటీ ఉండదు. ఇన్నర్ కాంపిటీషన్ మినహా వెలుపలి నుంచి క్రేజీ రిలీజ్ ల తో ఎలాంటి ఇబ్బందీ ఉండదని భావిస్తున్నారు. ఇక అన్ని మెట్రో నగరాల్లో తెలుగు సినిమాలు ఇటీవల భారీ కలెక్షన్స్ సాధిస్తున్నాయి. అయితే సంక్రాంతి బరిలో బడా హిందీ సినిమాలేవీ అడ్డంకిగా లేవు కాబట్టి అది తెలుగు సినిమాలకు కలెక్షన్ల పరంగా కలిసొస్తుందని ట్రేడ్ విశ్లేషిస్తోంది. హైదరాబాద్ - బెంగళూరు- చెన్నై సహా పలు నగరాల్లో మల్టీప్లెక్సుల్లో మన పెద్ద హీరోల సినిమాలు అత్యంత క్రేజీగా విడుదల కానున్నాయి.