Begin typing your search above and press return to search.
'ది బిగ్ బుల్' ట్రైలర్: ఆర్థిక నేరాలకు పాల్పడిన ఓ స్టాక్ బ్రోకర్ కథ
By: Tupaki Desk | 19 March 2021 12:53 PM ISTబాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ - ఇలియానా ప్రధాన పాత్రలతో తెరకెక్కుతున్న చిత్రం ''ది బిగ్ బుల్''. కూకీ గులాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 1980 - 90 కాలంలో స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా పాల్పడిన ఆర్థిక నేరాల ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ ని స్కిప్ చేసి డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదల అవుతోంది. ఏప్రిల్ 8న డిస్నీ + హాట్ స్టార్ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో విడుదల చేయనున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా 'ది బిగ్ బుల్' ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఆర్థిక నేరాల పాల్పడి భారతీయ స్టాక్ మార్కెట్ లో పెను సంచలనాలకు తెరలేపిన ఓ స్టాక్ బ్రోకర్ కథ ఇదని ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. కింది స్థాయి నుంచి వచ్చిన ఓ వ్యక్తి బిలినీయర్ అయ్యే క్రమంలో వ్యవస్థలను మ్యానేజ్ చేస్తూ సవాళ్ళను ఎదుర్కొంటూ స్టాక్ మార్కెట్ ని శాసించే రేంజ్ కి ఎలా ఎదిగాడు.. చివరకు ఎలా పతనం అయ్యాడు అనేది ఈ చిత్రంలో చూపించబోతున్నారు. స్టాక్ బ్రోకర్ గా అభిషేక్ బచ్చన్ నటించగా.. ఆ స్కామ్ ని బయటపెట్టే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో ఇలియానా కనిపిస్తోంది. నికితా దత్తా - సోహుమ్ షా - వరుణ్ శర్మ - చుంకీ పాండే - లేఖ ప్రజాపతి - కుముద్ మిశ్రా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.
అయితే హర్షద్ మెహతా జీవిత కథ ఆధారంగా గతేడాది 'స్కామ్ 1992' పేరుతో ఓ సిరీస్ వచ్చి సూపర్ సక్సెస్ అయింది. ఇండియాలో జరిగిన ఫస్ట్ బిగ్గెస్ట్ స్కామ్ గురించి ఇందులో చూపించారు. ఇప్పుడు అదే స్టోరీతో 'ది బిగ్ బుల్' సినిమా వస్తోంది. ఇప్పటికే 'స్కామ్' సిరీస్ చూసిన వారికి ఈ ట్రైలర్ గొప్పగా అనిపించకపోవచ్చు. మరి స్టార్ క్యాస్టింగ్ తో వస్తున్న ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. 'బిగ్ బుల్' చిత్రాన్ని అజయ్ దేవగణ్ ఫిల్మ్స్ - ఆనంద్ పండిట్ మోషన్ పిక్చర్స్ పతాకలపై అజయ్ దేవ్‌గన్ - ఆనంద్ పండిట్ విక్రాంత్ శర్మ లు కలిసి సంయుక్తంగా నిర్మించారు.