Begin typing your search above and press return to search.

అందాల నిధి అక్కడ ఇక్కడ బిజీ బిజీ

By:  Tupaki Desk   |   26 Jun 2021 4:30 AM GMT
అందాల నిధి అక్కడ ఇక్కడ బిజీ బిజీ
X
ఇస్మార్ట్‌ శంకర్ తో అందాల నిధి అగర్వాల్‌ టాలీవుడ్‌ లో బిజీ అయ్యింది. టాలీవుడ్ టాప్ స్టార్‌ పవన్ కళ్యాణ్‌ తో హరి హర వీరమల్లు సినిమాలో నటించే అవకాశంను దక్కించుకున్న ఈ అమ్మడు మరో వైపు మహేష్‌ బాబు మేనల్లుడు అశోక్‌ గల్లా మొదటి సినిమా 'హీరో' లో కూడా నటిస్తోంది. పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా తెలుగు లో ఈమె మరికొన్ని సినిమాల్లో కూడా నటిస్తూ ఉంది. టాలీవుడ్‌ లో మోస్ట్‌ బిజీ హీరోయిన్‌ గా పేరు దక్కించుకున్న ఈ అమ్మడు మరో వైపు హిందీ మరియు తమిళంలో కూడా ఆఫర్లు దక్కించుకుంటుంది.

ముఖ్యంగా ఈమె తమిళంలో ఒక పెద్ద హీరో సినిమా లో ఎంపిక అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. తమిళనాట ఈమెకు ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. కనుక మరిన్ని ఆఫర్లు కూడా ఆమె తలుపు తట్టే అవకాశం ఉందంటున్నారు. తమిళంలో ఈమె చేయబోతున్న సినిమాలు రాబోయే రోజుల్లో వరుసగా బాక్సాఫీస్ వద్ద సందడి చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. నిధి అగర్వాల్‌ అందాల వింధు చేయడంతో పాటు నటన పరంగా కూడా మంచి మార్కులు దక్కించుకుంటూ ఉంటుంది.

హరి హర వీరమల్లు తర్వాత టాలీవుడ్ లో ఆమె స్టార్‌ హీరోయిన్ గా నిలవడం ఖాయం. ఇదే సమయంలో తమిళంలో చేస్తున్న సినిమా ల కారణంగా వచ్చే ఏడాది బిజీ హీరోయిన్ గా మారే అవకాశం ఉంది. మరో వైపు హిందీ నుండి కూడా ఈమెకు చిన్నా చితకా సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. వరుసగా ఇన్ని భాషల్లో సినిమా లు చేస్తున్న నిధి అగర్వాల్‌ అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్ల బిజీ బిజీగా ఉంది. కరోనా కారణంగా ఆమె సినిమాలు తక్కువ అయ్యాయి. మళ్లీ షూటింగ్‌ లు పునః ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఆమె సినిమా లు ఒకదాని తర్వాత మరోటి అన్నట్లుగా బ్యాక్ టు బ్యాక్ వచ్చే అవకాశం ఉంది.