Begin typing your search above and press return to search.

ఒక్క హిట్ తో రెమ్యున‌రేష‌న్ ను భారీగా పెంచేసిన 'సీతారామం' బ్యూటి!?

By:  Tupaki Desk   |   27 Aug 2022 8:30 AM GMT
ఒక్క హిట్ తో రెమ్యున‌రేష‌న్ ను భారీగా పెంచేసిన సీతారామం బ్యూటి!?
X
సీతారామం... ఆగ‌స్టు మొద‌టి వారం విడుద‌లైన ఈ చిత్రం ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. యుద్ధ నేప‌థ్యంలో సాగే ఓ అద్భుత‌మైన మ‌రియు అంద‌మైన ప్రేమ కావ్యం ఇది. హను రాఘవపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో మ‌ల‌యాళ స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్‌, బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంట‌గా న‌టించారు. సీతా, రామ్ లుగా తాము త‌ప్పా ఎవ‌రూ ఈ సినిమాలో స‌రిపోరు అన్నంత‌గా దుల్క‌ర్‌, మృణాల్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు.

ముఖ్యంగా మృణాల్ ఈ సినిమాతో టాలీవుడ్ లో విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించుకుంది. హిందీ సీరియ‌ల్స్‌ ద్వారా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ‌.. 2014లో విడుద‌లైన 'విట్టి దండు' అనే మరాఠి చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ త‌ర్వాత హిందీలో ఆఫ‌ర్ల‌ను ద‌క్కించుకున్న మృణాల్‌.. 'సీతారామం'తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టి ఓవ‌ర్ నైట్ స్టార్ గా మారింది.

ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డుకు తెలుగులో వ‌రుస ఆఫ‌ర్లు త‌లుపు త‌డుతున్నాయి. ఇలాంటి త‌రుణంలో మృణాల్ తన రెమ్యున‌రేష‌న్ ను భారీగా పెంచేసింద‌ట‌. సాధార‌ణంగా హీరోయిన్లు ఒక్క హిట్ ప‌డిందంటే చాలు రేటు పెంచేస్తుంటారు. అందుకు కార‌ణం లేక‌పోలేదు. గ్లామర్ ఫీల్డ్ లో హీరోయిన్ల కెరీర్ ఎప్పుడూ సాఫీగా సాగ‌డం అసాధ్యం. ఎన్నాళ్లు ఫామ్ లో ఉంటారో, ఎప్పుడు ఫేడ్ అవుట్ అయిపోతారో కూడా చెప్ప‌లేము.

అందుకే మంచి క్రేజ్ ఉన్న‌ప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి హీరోయిన్లు ఆరాట‌ప‌డుతుంటారు. ఈ నేప‌థ్యంలోనే 'సీతారామం' హిట్ ప‌డ‌గానే మృణాల్ సైతం త‌న రెమ్యున‌రేష‌న్ ను పెంచేసింద‌ని.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. కోటి డిమాండ్ చేస్తుంద‌ని తాజాగా ఓ టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇక ఆమె ఆ నెంబ‌ర్ చెప్ప‌గానే అవాక్ అవ్వ‌డం నిర్మాత‌ల వంతైన‌ట్లు కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది.

కాగా, మృణాల్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. 'సీతారామం' ను నిర్మించిన వైజయంతి బ్యానర్ లోనే ఆమె మ‌రో ప్రాజెక్ట్ చేయ‌బోతోంద‌ట‌. ఆ సినిమాకు నందిని రెడ్డి దర్శకత్వం వ‌హించ‌నున్న‌ట్లు టాక్ న‌డుస్తోంది. అలాగే మ‌రోవైపు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, కొర‌టాల శివ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌బోయే 'ఎన్టీఆర్ 30'లోనూ మృణాల్ హీరోయిన్ గా ఎంపిక అయింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.