Begin typing your search above and press return to search.

'జెర్సీ'కి అవార్డ్ రావడం మరింత ఒత్తిడి పెంచిందంటున్న స్టార్ హీరో..!

By:  Tupaki Desk   |   24 March 2021 1:30 AM GMT
జెర్సీకి అవార్డ్ రావడం మరింత ఒత్తిడి పెంచిందంటున్న స్టార్ హీరో..!
X
నేచురల్ స్టార్ నాని - శ్రద్ధా శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన స్పోర్ట్స్ డ్రామా ''జెర్సీ''. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. సితార ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా తెలుగు ఆడియన్స్ ని మెప్పించడమే కాకుండా టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కి కూడా ఎంపికైంది. ఈ క్రమంలో ఇప్పుడు 'జెర్సీ' సినిమా రెండు విభాగాల్లో నేషనల్ అవార్డ్స్ అందుకుంది. 'ఉత్తమ తెలుగు చిత్రం'తో పాటుగా 'ఉత్తమ ఎడిటర్' గా నవీన్ నూలి కి అవార్డులు వరించాయి.

ఇదిలా ఉండగా బాలీవుడ్ హీరో షాహిద్ క‌పూర్ తో 'జెర్సీ' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. మాతృకను డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కోచ్ పాత్రలో షాహిద్ కపూర్ తండ్రి పంకజ్ కపూర్ నటిస్తున్నాడు. బాలీవుడ్ ప్రొడ్యూసర్ అమన్ గిల్ తో కలిసి అల్లు అరవింద్ - దిల్‌ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న హిందీ 'జెర్సీ' ని దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నారు.

అయితే తెలుగు 'జెర్సీ' చిత్రానికి నేషనల్ అవార్డ్ రావడం పట్ల హీరో షాహిద్ కపూర్ 'జెర్సీ' చిత్ర బృందాన్ని అభినందిస్తూ దీని వల్ల తనపై మరింత ఒత్తిడి పెరిగినట్లు ట్వీట్ చేసాడు. ''జెర్సీ చిత్ర బృందం మొత్తానికి నా అభినందనలు. ఎక్స్ట్రా ప్రెజర్ ఇచ్చినందుకు ధన్యవాదాలు'' అని షాహిద్ ట్వీట్ లో పేర్కొన్నాడు.