Begin typing your search above and press return to search.

'అవెంజర్స్- ఎండ్ గేమ్' క‌థ లీక్‌

By:  Tupaki Desk   |   16 March 2019 10:58 AM GMT
అవెంజర్స్- ఎండ్ గేమ్ క‌థ లీక్‌
X
సూప‌ర్ హీరో సినిమాల‌కు ఇండియాలో ఆద‌ర‌ణ అంత‌కంత‌కు పెరుగుతోంద‌న‌డంలో సందేహం లేదు. 2018లో అర‌డ‌జ‌ను సూప‌ర్ హీరో సినిమాలు రిలీజై ప్ర‌తిదీ.. 300కోట్లు సుమారు క‌లెక్ష‌న్స్ సాధించాయి అంటే అర్థం చేసుకోవ‌చ్చు. రియ‌ల్ 3డిలో సూప‌ర్ హీరో విన్యాసాల్ని వీక్షించేందుకు మ‌న ఆడియెన్ ఎంతో ఇష్ట‌ప‌డుతున్నారు. మెట్రోలు స‌హా టూటైర్ సిటీల్లోనూ తెలుగు వెర్ష‌న్లు రిలీజ‌వుతుండ‌డంతో వ‌సూళ్ల ప‌రంగానూ అద‌ర‌గొట్టేస్తున్నాయి ఈ చిత్రాలు.

ఇటీవ‌లే లేడీ కెప్టెన్ మార్వ‌ల్ ఇండియాలో రిలీజై ఘ‌న‌విజ‌యం సాధించింది. కేవ‌లం మ‌న దేశం నుంచి తొలి వారంలోనే 50కోట్లు వ‌సూలు చేసింది. ఇంకా దిగ్విజ‌యంగా ర‌న్ అవుతోంది. త‌దుప‌రి రిలీజ్ కి రాబోతున్న మోస్ట్ క్రేజీ మూవీ `అవెంజ‌ర్స్- ఎండ్ గేమ్‌-3డి` సంచ‌ల‌నాల‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా ఎంసీయు వ‌ర‌ల్డ్ వైడ్ ఫ్యాన్స్ తో పాటు ఇండియా ఫ్యాన్స్ కి విజువ‌ల్ ట్రీట్ ని అందించ‌బోతోంది. తాజాగా రివీల్ చేసిన ట్రైల‌ర్ అంత‌ర్జాలంలో దూసుకెళుతోంది.

అయితే ఈ సినిమాలో తొలి 20 నిమిషాల్లో సూప‌ర్ హీరోలంతా అంత‌మ‌వుతారు! అన్న ట్విస్టును తాజాగా అభిమానులు ప్ర‌త్యేక థియ‌రీల‌లో రివీల్ చేస్తున్నారు. ఇప్ప‌టికే థానోస్ వ‌ర్సెస్ సూప‌ర్ హీరోల పోరాటాల‌కు సంబంధించి అవెంజ‌ర్స్ అభిమానులు ఎవ‌రికి వారు ర‌క‌ర‌కాలుగా థియ‌రీల్ని పుట్టిస్తున్నారు. తాజా ట్రైల‌ర్ లో థానోస్ కి ఏమాత్రం ప్రాధాన్య‌త‌నివ్వ‌కుండా సూప‌ర్ హీరోల్ని ఎలివేట్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. ఇక‌పోతే సూప‌ర్ హీరోలంతా 20 నిమిషాల లోపు చ‌నిపోతే ఆ త‌ర్వాత కిక్కేం ఉంటుంది అనుకుంటున్నారా? అక్క‌డే ఉంది అస‌లు మ్యాట‌ర్. సూప‌ర్ హీరోలు పాక్షికంగానే అంత‌మ‌వుతారు. తిరిగి ఎలా వ‌స్తారు? అన్న‌ది తెర‌పై చూడాల్సిందే. కెప్టెన్ మార్వ‌ల్ - యాంట్ మేన్ - బ్లాక్ పాంథ‌ర్ - థోర్ - ఐర‌న్ మేన్ ఇంత‌మంది సూప‌ర్ హీరోల్ని తెర‌పై ఒకే ఫ్రేమ్ లో చూడ‌బోతున్నాం. ఏప్రిల్ 26న సినిమా రిలీజ‌వుతోంది. ఈ సినిమా కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా వీరాభిమానులు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు. ఇండియా ఫ్యాన్స్ అంతే ఎగ్జ‌యిటింగ్ గా ఎదురు చూస్తున్నార‌న‌డంలో ఎలాంటి సందేహాలు లేవు. అవెంజ‌ర్స్ సిరీస్ లో చివ‌రిదిగా చెబుతున్న ఈ ఎండ్ గేమ్ కి జో - ఆంథోని ర‌స్సో సంయుక్తంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.