Begin typing your search above and press return to search.
డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కాని హీరో భార్య.. అధికారులు సీరియస్
By: Tupaki Desk | 18 Oct 2020 8:20 AM ISTబాలీవుడ్ డ్రగ్స్ కేసు చల్లారి పోయినట్లుగా అనిపిస్తుంది. కాని కన్నడ డ్రగ్స్ కేసు మాత్రం ఇంకా చల్లారలేదు. ఇద్దరు హీరోయిన్స్ ఈ కేసులో అరెస్ట్ అవ్వడంతో పాటు ఇంకా పలువురు విచారణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో కీలక నింధితుడిగా అనుమానిస్తున్న ఆధిత్య ఆళ్వాను పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నస్తూ ఉంటే ఆయన చిక్కడం లేదు. పోలీసులు అతడి గురించి ఎక్వౌరీ చేసిన సమయంలో అతడి సోదరి అయిన ప్రియాంక ఆళ్వాతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆమెను ఎంక్వౌరీ చేస్తే అతడి వివరాలు తెలుస్తాయని వెళ్లడయ్యిందట. ప్రియాంక ఆళ్వా మరెవ్వరో కాదు బాలీవుడ్ స్టార్ నటుడు వివేక్ ఒబేరాయ్ భార్య. ఆమెను సీబీఐ వారు ఎంక్వౌరీ చేసేందుకు నోటీసులు ఇచ్చారు.
ఎంక్వౌరీకి హాజరు అవ్వాలంటూ నోటీసులు ఇచ్చినా కూడా ఆమె హాజరు కాకపోవడంపై అధికారులు సీరియస్ అయ్యారు. ఆమె తరపున లాయర్ ను పంపించేందుకు ఆమె అనుమతులు కోరింది. అందుకు అధికారులు నో చెప్పినా కూడా ఆమె మాత్రం విచారణకు హాజరు కాలేదు. దాంతో ఆమెకు మరోసారి నోటీసులు ఇస్తామంటూ అధికారులు అన్నారు. ఈసారి కూడా ఆమె విచారణకు హాజరు కాకుంటే తదుపరి చర్యలకు సిద్దం అవుతామని అన్నారు.
ఆమె సోదరుడు ఆధిత్య ఆళ్వా గురించిన విషయాలను తాము సేకరించాలని భావిస్తున్నాం. కాని ఆమె మాత్రం మాకు సహకరించడం లేదు అంటూ ఒక అధికారి జాతీయ మీడియాతో మాట్లాడుతూ అన్నారట. కన్నడ సినిమా పరిశ్రమ డ్రగ్స్ కేసు ఇప్పుడు హిందీ నటుడి భార్యకు చుట్టుకుంది. దీని నుండి ఆమె ఎలా బయట పడుతుందో చూడాలి. ఆమె సోదరుడిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.