Begin typing your search above and press return to search.

'అరణ్య' ఫలితం ముందే తెలిసినట్లుంది

By:  Tupaki Desk   |   27 March 2021 8:03 AM GMT
అరణ్య ఫలితం ముందే తెలిసినట్లుంది
X
రానా ప్రధాన పాత్రలో నటించిన అరణ్య సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా నిడివి మొదట మూడు గంటలకు కాస్త తక్కువ ఉండేనట. అంత నిడివితో సినిమా అంటే ఖచ్చితంగా ప్రేక్షకులు బోర్‌ ఫీల్ అవుతారనే ఉద్దేశ్యంతో దాదాపుగా 30 నిమిషాలను కట్‌ చేశారట. దర్శకుడు ఫైనల్‌ చేసిన రన్ టైమ్‌ నుండి నిర్మాత సురేష్ బాబు సన్నిహితులతో చర్చించి దాదాపుగా అరగంట పాటు కట్‌ చేసి సినిమా సేవ్‌ చేసే ప్రయత్నం చేశాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపించింది. కంటెంట్ బాగుంటే మూడు గంటలు అయినా చూస్తారని ఇంతకు ముందు సినిమాల విషయంలో నిరూపితం అయ్యింది. అరణ్య సినిమా కంటెంట్‌ తేడా కొట్టడం వల్లే సురేష్‌ బాబుకు అనుమానం వచ్చి తగ్గించే ప్రయత్నం చేశారని.. ట్రిమ్‌ చేయడం వల్ల కాస్త అయినా ప్రయోజనం ఉంటుందని ఆయన భావించి ఉంటాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

అరణ్య సినిమాకు విమర్శకుల నుండి మంచి ప్రయత్నం అంటూ పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఇలాంటి పాత్రను.. ఇలాంటి సినిమాను చేసేందుకు ముందుకు వచ్చిన రానాను అభినందించకుండా ఉండలేం. కాని ఇప్పుడు ప్రేక్షకులు ఎంటర్ టైన్‌మెంట్‌ ను కోరుకుంటున్నారు. ఇలాంటి డాక్యుమెంటరీ టైమ్‌ సినిమాలను జనాలు ఆధరించే రోజులు లేవు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సినిమాలను ఎట్టి పరిస్థితుల్లో ఆధరించే పరిస్థితి లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కమర్షియల్‌ మూవీకి అలవాటు పడ్డ తెలుగు ప్రేక్షకులు అరణ్య సినిమా గురించి పాజిటివ్‌ గా మాట్లాడుకుంటున్నారు తప్ప చూసేందుకు మాత్రం ఆసక్తి చూపడం లేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. 30 నిమిషాలు తగ్గించినా కూడా ఫలితం అటు ఇటుగానే ఉందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.