Begin typing your search above and press return to search.
'వకీల్ సాబ్' ప్రతిక్షణం ఉత్కంఠను రేపుతుందట!
By: Tupaki Desk | 4 April 2021 10:00 PM ISTపవన్ కల్యాణ్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'వకీల్ సాబ్' ముస్తాబవుతోంది. చాలా గ్యాప్ తరువాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో, ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పవన్ పాత రికార్డులను ఈ సినిమా తుడిచేస్తుందనే టాక్ కూడా బలంగా వినిపిస్తోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ నెల 9వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ గురించి 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.
"అన్నం ఉడికిందో లేదో ఒక మెతుకును చూసి చెప్పచ్చు. ఇంటిముందు ముగ్గుచూసి ఇల్లాలును గురించి తెలుసుకోవచ్చు. అలాగే ట్రైలర్ ను చూసి ఆ సినిమాలో ఎంత దమ్ముందో తెలుసుకోవచ్చు. రీసెంట్ గా వదిలిన 'వకీల్ సాబ్' ట్రైలర్ నాకు బాగా నచ్చింది. ఒక బలహీనురాలిపై ఒక బలవంతుడు చేస్తున్న కుట్ర నుంచి ఆమెను కాపాడటానికి ఒక సింహం వస్తుంది. ఆ సింహమే పవన్ కల్యాణ్ అనే విషయం మనకి అర్థమైపోయింది. సింహం వస్తే రెండు నిమిషాల్లో కథ అయిపోతుందిగదా అనుకుంటాము. కానీ పవన్ కి ఎదురుగా మరో సింహం వచ్చి నుంచుంది .. ఆ సింహం పేరే ప్రకాశ్ రాజ్.
బోనులో ఉన్న ఓ అమ్మాయిని నువ్వు కన్యవేనా అని ప్రకాశ్ రాజ్ అడుగుతాడు. ఆర్ యు వర్జిన్? అనే ప్రశ్నను బోనులో ఉన్న ఓ అబ్బాయిని పవన్ అడుగుతాడు. దీనిని బట్టి ప్రకాశ్ రాజును పవన్ ఢీకొట్టబోతున్నాడనే విషయం అర్థమవుతోంది. ప్రతిక్షణం ఉత్కంఠభరితం అన్నట్టుగా ట్రైలర్ సాగింది. కథ అర్థమైనా .. హీరో ఎలా సాధించుకువస్తాడనేది ఉత్కంఠభరితంగా చెప్పగలిగితే ఆ సినిమా అద్భుతంగా ఆడుతుంది. అందుకు ఉదాహరణగా ఈ సినిమా ట్రైలర్ కనిపిస్తోంది. పవన్ నటన కొత్తగా అనిపించింది .. ట్రైలర్ అదిరిపోయింది" అని చెప్పుకొచ్చారు.