Begin typing your search above and press return to search.

సైరా టీమ్ కంటే అల టీమ్ జోరుగా ఉందే!

By:  Tupaki Desk   |   28 Sep 2019 2:30 PM GMT
సైరా టీమ్ కంటే అల టీమ్ జోరుగా ఉందే!
X
థియేట్రికల్ రన్ వారానికి.. ఎక్కువ మాట్లాడితే మూడు రోజులకు పడిపోయిన ఈ జెనరేషన్లో ప్రమోషన్స్ కీలకపాత్ర పోషిస్తున్నాయి. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న రెండు సినిమాల ప్రమోషన్స్ మూడు నెలల ముందుగా ప్రారంభించారు అంటే ప్రమోషన్స్ ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు. అటు 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ రెగ్యులర్ గా ఏదో ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ఆగష్టు 15 కు స్పెషల్ టీజర్ కూడా రిలీజ్ చేసి ప్రమోషన్స్ లో ముందంజలో ఉంది. ఇక 'అల వైకుంఠపురములో' టీం కూడా ప్రమోషన్స్ లో అదే జోరు చూపిస్తోంది.

ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్.. ఇతర పోస్టర్ లు రిలీజ్ చేసిన 'అల వైకుంఠపురములో' టీమ్ ఈరోజు ఫస్ట్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. మూడు నెలల ముందు పాటను రిలీజ్ చెయడమెందుకు అని అనుకోవచ్చు కానీ సినిమాపై బజ్ పెంచేందుకు.. క్రేజ్ తీసుకొచ్చేందుకు ఇలా చేయడమే సరైన పని అని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే 'అల వైకుంఠపురములో' ప్రోమోస్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. నిజానికి ఫ్యాన్స్ కూడా ఈ ప్రోమోస్ తో థ్రిల్లయ్యారు. కానీ 'సైరా' విషయమే తీసుకుంటే ఇదే ప్రమోషన్స్ విషయంలో అభిమానులు అప్సెట్ కావడం గమనించవచ్చు.

సినిమా విడుదలకు వారం రోజులే ఉన్నా ప్రమోషన్స్ వీక్ గా ఉన్నాయని ఈమధ్యే అభిమానులు కొణిదెల ప్రొడక్షన్స్ ట్విట్టర్ హ్యాండిల్ లో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. 'సైరా' ను ప్యాన్ ఇండియా ఫిలింగా ప్రొజెక్ట్ చేయడంతో ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ ఉంటాయని అభిమానులు ఆశించడం పొరపాటేమీ కాదు. 'సాహో' రిలీజ్ కాకమునుపు ఒక దశలో అప్డేట్స్ లేవని ఫ్యాన్స్ ఆందోళన చేయడం కూడా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. అయితే 'సాహో' రిలీజ్ కు ముందు మాత్రం ప్రభాస్ స్వయంగా రంగంలోకి దిగి ప్రమోషన్స్ ను పరుగులు పెట్టించాడు. కానీ 'సైరా' విషయం లో మాత్రం ప్రమోషన్స్ ఊపందుకోకపోవడం నిరాశకలిగిస్తోంది. ఈ విషయంలో సంక్రాంతి సినిమాలే జోరుగా ఉన్నాయని చెప్పకతప్పదు.