Begin typing your search above and press return to search.

పుష్ప వద్దకు వెళ్లిన 'ఏజెంట్‌'.. కేవలం పుకార్లే

By:  Tupaki Desk   |   12 April 2022 6:30 AM GMT
పుష్ప వద్దకు వెళ్లిన ఏజెంట్‌.. కేవలం పుకార్లే
X
అల్లు అర్జున్‌ పుష్ప సినిమా తర్వాత అనూహ్యంగా స్పీడ్ పెంచాడు. పుష్ప 2 సినిమా చిత్రీకరణకు రెడీ అవుతుంది. మరో వైపు రెండు కొత్త సినిమాలకు కూడా ఈయన సైన్ చేశాడు. ఈ సమయంలోనే ఏజెంట్‌ చిత్ర దర్శకుడు సురేందర్‌ రెడ్డి కూడా అల్లు అర్జున్‌ తో సినిమాకు సిద్దం అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ వార్తల్లో నిజం ఎంత అనే విషయంపై మీడియా లో చర్చజరిగింది.

వీరిద్దరి కాంబోలో గతంలో సినిమా వచ్చింది.. అది మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక ఇప్పుడు ఖచ్చితంగా వీరిద్దరి కాంబోలో మూవీ ఉంటుందని ప్రతి ఒక్కరు భావించారు. కాని అసలు విషయం ఏంటీ అంటూ అల్లు అర్జున్‌ వద్దకు ఈమద్య కాలంలో సినిమా విషయమై సురేందర్‌ రెడ్డి వెళ్లిందే లేదట. మీడియాలో వస్తున్న వార్తలు కేవలం పుకార్లే అని.. సోషల్‌ మీడియాలో పొద్దుపోని ముచ్చట్లు అవి అంటూ బన్నీ సన్నిహితులు తేల్చి పారేశారు.

అసలు విషయం ఏంటీ అంటే ఏజెంట్‌ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమా ఇప్పటికే కన్ఫర్మ్‌ అయ్యింది. పవన్ కళ్యాణ్ తో సూరి సినిమా ను చేయాల్సి ఉంది. అందుకు సంబంధించిన చర్చలు జరిగాయి.. అధికారిక ప్రకటన వచ్చింది. పవన్ సన్నిహితుడు ఈ సినిమాను నిర్మించబోతున్న విషయం తెల్సిందే. కరోనా వల్ల ఆలస్యం అయ్యింది కాని ఇప్పటికే పట్టాలెక్కాల్సి ఉంది.

ఏజెంట్‌ సినిమాను రాబోయే రెండు నెలల్లోనే పూర్తి చేయబోతున్న సురేందర్ రెడ్డి ఈ ఏడాది ఆగస్టు లో ఏజెంట్‌ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఏజెంట్‌ సినిమా లో అఖిల్ లుక్ ను చూసి అక్కినేని ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా విడుదల అవుతుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సురేందర్‌ రెడ్డి కి స్టైలిష్ డైరెక్టర్ గా పేరుంది. కనుక పవన్‌ తో ఈయన చేయబోతున్న సినిమా ఖచ్చితంగా ఓ రేంజ్ లో ఉంటుందనే నమ్మకం ను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.

ఏజెంట్‌ సక్సెస్ అయితే పవన్ సినిమా వెంటనే మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కనుక అల్లు అర్జున్ తో సూరి సినిమా ఇప్పట్లో ఉండదు. కనుక అల్లు అర్జున్ వద్దకు ఆఫర్‌ కోసం సురేందర్‌ రెడ్డి వెళ్లినట్లుగా వస్తున్న వార్తలు పూర్తి గా అవాస్తవం.