Begin typing your search above and press return to search.

ముద్దొస్తున్న క్యూట్‌ అక్కినేని హీరో

By:  Tupaki Desk   |   11 Feb 2022 2:30 PM GMT
ముద్దొస్తున్న క్యూట్‌ అక్కినేని హీరో
X
అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్‌ ఇన్ స్టా గ్రామ్‌ లో షేర్ చేసిన ఈ ఫొటో వైరల్‌ అవుతోంది. తండ్రి పుట్టిన రోజు సందర్బంగా సుశాంత్‌ ఈ ఫొటోను షేర్‌ చేశాడు. హ్యాపీ బర్త్‌ డే నాన్న. మీరు ఎప్పటికి మాతోనే ఉంటారు.. మీ ప్రేమకు.. మీతో అద్బుతమైన క్షణాలకు కృతజ్ఞతలు అంటూ లవ్‌ ఈమోజీను సుశాంత్‌ షేర్‌ చేశాడు.

తండ్రి కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడం కోసం సుశాంత్‌ షేర్ చేసిన ఫొటోల్లో ఈ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే సుశాంత్ చినప్పటి ఈ ఫొటోలో చాలా క్యూట్‌ గా కనిపిస్తున్నాడు.. ప్రతి ఒక్కరు కూడా వావ్‌ అంటూ ప్రశంసించే విధంగా ఉన్నాడు. సుశాంత్‌ క్యూట్ లుక్ కు ప్రతి ఒక్కరు కూడా ఫిదా అవుతున్నారు. భలే ముద్దొస్తున్నాడే అంటూ సుశాంత్ కు లవ్‌ ఈమోజీలు షేర్‌ చేస్తున్నారు.

ఈ ఫొటోలో సుశాంత్ తండ్రితో పాటు తల్లిని కూడా చూడవచ్చు. ఏయన్నార్‌ దసరా బుల్లోడి లుక్ లో సుశాంత్‌ చిన్నప్పుడే అదరగొట్టేశాడు అని ఈ ఫోటో చూస్తుంటే అనిపిస్తుంది. ఇక సుశాంత్‌ సినీ కెరీర్‌ గురించి చెప్పుకోవాలంటే 2008 సంవత్సరంలో కాళిదాసు సినిమాతో ఇండస్ట్రీకి అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్‌ మొదటి సినిమాతో నిరాశ పర్చాడు.

ఆ తర్వాత కరెంట్‌ సినిమా తో కమర్షియల్‌ గా మంచి టాక్ దక్కించుకున్న సుశాంత్ కెరీర్‌ లో ఒడిదొడుకులు ఎదుర్కొంటూ వస్తున్నాడు. 2018 సంవత్సరంలో వచ్చిన చిలసౌ సినిమా ఆయన కు మంచి సక్సెస్ ను తెచ్చి పెట్టింది. ఇబ్బడి ముబ్బడిగా సినిమాలకు కమిట్‌ అవ్వకుండా పాత్రకు ప్రాముఖ్యత ఇస్తూ సినిమాలు చేసిన సుశాంత్ సెకండ్‌ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు.

అల్లు అర్జున్‌ నటించిన అల వైకుంఠపురంలో సినిమా తో సుశాంత్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సెకండ్‌ ఇన్నింగ్స్ ను ఆరంభించాడు. తాజాగా రవితేజ హీరోగా నటిస్తున్న రావణసుర సినిమాలో కూడా కీలకమైన పాత్రకు ఓకే చెప్పాడు. విలన్ గా మరియు క్యారెక్టర్‌ ఆర్టిస్టు గా నటించేందుకు సిద్దం అయిన సుశాంత్‌ కు మంచి ఆఫర్లే వస్తున్నాయి.

హీరో గా చేసినట్లుగా కాకుండా సెకండ్‌ ఇన్నింగ్స్ లో విభిన్నంగా తన పాత్రలు ఉండేలా ప్లాన్‌ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. నటుడిగా మంచి పేరు దక్కించుకునే సినిమాలు చేసేందుకు సుశాంత్‌ పాత్రల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడట.