Begin typing your search above and press return to search.
70 అవార్డులు దక్కించుకున్న షార్ట్ ఫిల్మ్ వచ్చేసింది
By: Tupaki Desk | 22 July 2020 4:00 PM ISTయూఎస్ లో మాస్టర్స్ పూర్తి చేసిన దీపక్ సినిమాలపై ఆసక్తితో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీయడంతో పాటు డిస్ట్రిబ్యూటర్ గా చేశాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఫిదా’ చిత్రానికి సహాయ దర్శకుడిగా కూడా చేశాడు. గతంలో దీపక్ తీసిన పలు షార్ట్ ఫిల్మ్ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఈయన రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ‘మనసానమ:’. ఇప్పటికే ఈ సినిమా పలు అంతర్జాతీయ వేదికలపై ప్రసారం అయ్యింది. ఏకంగా 70 అంతర్జాతీయ అవార్డులను ఈ చిత్రం దక్కించుకుంది. సినీ ప్రముఖుల ప్రశంసలు కూడా ఈ సినిమాకు అందాయి.
చైత్రమాసం వర్షాకాలం శీతాకాలంలో సూర్యుడు ఏవిధంగా వాతావరణంకు మార్పు చెందుతూ ఉంటాడో అలాగే నిజ జీవితంలో కూడా సూర్య అనే వ్యక్తి మూడు సీజన్ ల్లో ముగ్గురు అమ్మాయిలతో ప్రవర్తించే తీరును విభిన్నంగా దర్శకుడు దీపక్ తెరకెక్కించాడు. ఈ కాన్సెప్ట్ చాలా విభిన్నంగా ఉందంటూ సినీ ప్రముఖులు అంతా కూడా ప్రశంసలు కురిపించారు.
అనుష్క స్పందిస్తూ.. సినిమా చాలా ప్రత్యేకంగా ఉంది. నాకు బాగా నచ్చింది. దర్శకుడు చాలా తెలివిగా ఆకట్టుకునేలా తెరకెక్కించాడు. ఈ అద్బుతమైన చిత్రంలో నటించిన వారికి అందరికి అభినందనలు. అందరు చూడదగ్గ ఫిల్మ్ అంది. సినిమా చూశాక మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఇదొక అందమైన చిత్రం అంటూ రష్మిక మందన్న కూడా అభిప్రాయం వ్యక్తం చేసింది.
సినీ ప్రముఖుల ప్రశంసలు దక్కించుకున్న ఈ షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా ఈ షార్ట్ ఫిల్మ్ ను ప్రేక్షకులు తెగ ఆధరిస్తున్నారు. 16 నిమిషాల నిడివి ఉన్న ఒక షార్ట్ ఫిల్మ్ కు మరీ ఈ స్థాయిలో స్పందన రావడం నిజంగా ఆశ్చర్యకర విషయం.