Begin typing your search above and press return to search.

అందుకే సూపర్ స్టార్.. ఆ నిర్ణయం తీసుకున్నాడట!

By:  Tupaki Desk   |   19 March 2021 12:30 PM IST
అందుకే సూపర్ స్టార్.. ఆ నిర్ణయం తీసుకున్నాడట!
X
సూపర్ స్టార్ తలైవా రజినీకాంత్.. ప్రస్తుతం పలు భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందులో ఒకటి అన్నాతే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న అన్నాతే సినిమాను ఆ మధ్య షూటింగ్ సమయంలో పలువురు సినీ సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో వెంటనే అప్రమత్తమై షూటింగ్ నిలిపేశారు మేకర్స్. ఆ తర్వాత కొన్నిరోజులకు ప్రారంభిద్దాం అనుకుంటే.. సూపర్ స్టార్ ఆరోగ్య పరిస్థితి బాలేక ఆసుపత్రిలో చేరడంతో సినిమా ప్రారంభించే అవకాశం రాలేదు. తర్వాత రజినీకాంత్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాక చిత్రబృందం వారిళ్లకు చేరుకుంది. ప్రస్తుతం చెన్నైలో ఉన్న అన్నాతే బృందం తమిళనాడు ఎలక్షన్స్ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేస్తారని టాక్ వచ్చింది.

కానీ అన్నాతే సినిమాను దీపావళికే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించడంతో సూపర్ స్టార్ ఆలస్యం చేయకుండా షూటింగ్ మొదలు పెట్టేసాడు. ప్రస్తుతం అన్నాతే షూటింగ్ చెన్నైలో ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణంలో షూట్ చేస్తున్నారట. అయితే రజినీ ఆరోగ్యం పరిస్థితి దృష్టిలో ఉంచుకొని చిత్రబృందం ఓ వైద్యబృందాన్ని కూడా షూటింగ్ ప్రదేశంలో నియమించుకున్నట్లు సమాచారం. ఆ మధ్య రజినీ రాజకీయ రంగప్రవేశం చేస్తానని మళ్లీ ఆ నిర్ణయం మార్చుకున్నాడు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. గతకొన్నేళ్లుగా సూపర్ స్టార్ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అందుకే ఇప్పుడు రాజకీయాలంటే ప్రజలలో తిరగటం చాలా కష్టమైనది. వైద్యుల సలహా మేరకు అన్నివిధాలా ఆలోచించి రజినీ ఆ నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం ఆయన షూటింగ్ ప్రదేశంలో వైద్యులు ఉన్నారంటే అర్ధం చేసుకోవచ్చు రజినీ తీసుకున్న నిర్ణయం సరైనదే అని. అన్నాతే సినిమాకు శివ దర్శకత్వం వహిస్తున్నాడు.