Begin typing your search above and press return to search.

ఐట‌మ్ గ‌ర్ల్ కాదు స్పెష‌ల్ గాళ్ ఇందుకే!

By:  Tupaki Desk   |   13 Jun 2021 8:30 AM GMT
ఐట‌మ్ గ‌ర్ల్ కాదు స్పెష‌ల్ గాళ్ ఇందుకే!
X
గ్లామ‌ర్ ఎలివేష‌న్ లో ట్రెండ్ సెట్ట‌ర్ గా నిలుస్తున్నారు యాంక‌ర్ కం న‌టి అనసూయ‌. రంగ‌స్థ‌లం రంగ‌మ్మ‌త్త‌గా త‌న‌కు ద‌క్కిన పాపులారిటీని ఏమాత్రం మిస్ యూజ్ చేయ‌ని అన‌సూయ ఈ గ్లామ‌ర్ ప్ర‌పంచానికి త‌న‌దైన స్పెష‌ల్ ట్రీట్ నిస్తూ హాట్ టాపిక్ గా మారుతున్నారు.

ఇటీవ‌ల ఈ అందాల యాంక‌ర్ బుల్లితెర కార్య‌క్ర‌మాల్ని మించి సినిమాల‌కు సంత‌కాలు చేస్తూ.. క్రేజు ప‌రంగా ఏ ఇత‌ర యాంక‌రు త‌న ద‌రిదాపుల్లో లేర‌ని నిరూపిస్తున్నారు. ఇప్ప‌టికిప్పుడు అన‌సూయ ఖాతాలో అర‌డ‌జ‌ను క్రేజీ సినిమాలున్నాయి. అల్లు అర్జున్ .. ర‌వితేజ‌.. ర‌మ్య‌కృష్ణ‌... విజ‌య్ సేతుప‌తి వంటి పెద్ద స్టార్ల సినిమాల్లో న‌టిస్తూ అన‌సూయ త‌న పాపులారిటీని మ‌రింత‌గా పెంచుకుంటున్నారు.

ఇక ఇన్ స్టా మాధ్యమంలో అన‌సూయ వ‌రుస ఫోటోషూట్లు యువ‌త‌రంలో జెట్ స్పీడ్ తో వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా రెడ్ డిజైన‌ర్ ఫ్రాకులో అన‌సూయ అంద‌చందాలు యువ‌త‌రాన్ని క‌వ్విస్తున్నాయి. పొట్టి ఫ్రాకులో ఎంతో స్టైలిష్ గా ఫోజులిస్తున్న అన‌సూయ ఫ్రీస్ట‌యిల్ కి ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి.

ప్ర‌తిభ‌తో పాటు ప‌బ్లిసిటీ అవ‌స‌రం ఇక్క‌డ‌. అందుకు త‌గ్గ‌ట్టే త‌న కెరీర్ ని మ‌లుచుకుంటున్న తీరు ప్ర‌శంస‌నీయం. తాను ఐట‌మ్ గర్ల్ ని కాద‌ని గ‌డుసుత‌నం చూపించిన అన‌సూయ క‌చ్ఛితంగా `స్పెష‌ల్ గాళ్` అని నిరూపిస్తున్నారు.