Begin typing your search above and press return to search.

అందుకే టెస్టులు రెగ్యులర్ చేయించుకుంటా: స్టార్ హీరోయిన్

By:  Tupaki Desk   |   3 April 2021 9:09 AM GMT
అందుకే టెస్టులు రెగ్యులర్ చేయించుకుంటా: స్టార్ హీరోయిన్
X
దక్షిణాది స్టార్ హీరోయిన్ శృతిహాసన్.. ప్రస్తుతం కెరీర్ పరంగా మళ్లీ బిజీ అవుతోంది. అలాగే తనకోసం వచ్చిన అవకాశాలను కూడా వదులుకోకుండా ఓకే చెబుతూ అలా షెడ్యూల్ బిజీ ఉండేలా చూసుకుంటుంది. ఆ మధ్యలో లవ్, బ్రేకప్స్ వలన అమ్మడు కొంతకాలం ఇండస్ట్రీకి దూరమైంది. ఇక బ్రేకప్ తర్వాత ఈ ఏడాది సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. రవితేజ సరసన క్రాక్ సినిమాతో తెలుగులో ఖాతా మళ్లీ మొదలుపెట్టింది. రీఎంట్రీతోనే సూపర్ హిట్ అందుకుంది. అలా ఆ సినిమా హిట్ అయిందో లేదో వెంటనే అమ్మడికి ఆఫర్స్ అలా వచ్చిపడ్డాయి. అందులో ఓ పాన్ ఇండియా సినిమా కూడా ఓకే అవ్వడం అదృష్టం అనే చెప్పాలి. అంతేగాక ఓ తమిళ స్టార్ హీరో సినిమాలో కూడా నటిస్తోంది.

అసలు విషయం ఏంటంటే.. శృతి చేతిలో ప్రస్తుతం సినిమాలే కాదు మాస్కులు, శానిటైజర్స్ కూడా కంపల్సరీ అన్నట్లుగా మెయింటైన్ చేస్తోందట. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ వేగంగా విస్తరించడంతో శృతి ఎప్పటికప్పుడు కోవిడ్ పరీక్షలు చేయించుకుంటుందట. తాజాగా ఎక్కువసార్లు కోవిడ్ పరీక్షలు ఎందుకు చేయించుకుంటున్నారు..? అనే ప్రశ్నకు ఈ విధంగా జవాబిచ్చింది. ఈ మధ్యకాలంలో సినిమా సెలబ్రిటీలు కూడా పెద్దసంఖ్యలో కోవిడ్ బారిన పడుతున్నారు. ఐతే నేను ఏ విధంగాను కరోనాను నిర్లక్ష్యం చేయాలనీ అనుకోట్లేదు. అంతేగాక నాకంటే ముందు.. నా వలన ఇబ్బంది పడకూడదనే నేను క్రమం తప్పకుండా కోవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నాను. షూటింగ్స్ సమయంలో వివిధ ప్రదేశాలకు వెళ్తుంటాం. కానీ ఎక్కడికెళ్లినా గవర్నమెంట్ ప్రోటోకాల్ తప్పకుండా పాటిస్తాను. అందుకే ఎక్కువగా కోవిడ్ టెస్టులు చేయిస్తా' అని చెప్పుకొచ్చింది సలార్ బ్యూటీ. ఏప్రిల్ 9న శృతి నటించిన వకీల్ సాబ్ రిలీజ్ అవుతోంది.