Begin typing your search above and press return to search.

రవితేజలో నాకు బాగా నచ్చే విషయం అదొక్కటే: దేవిశ్రీ

By:  Tupaki Desk   |   10 Feb 2022 3:18 AM GMT
రవితేజలో నాకు బాగా నచ్చే విషయం అదొక్కటే: దేవిశ్రీ
X
రవితేజ హీరోగా రమేశ్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ 'ఖిలాడి' సినిమాను నిర్మించారు. ఈ నెల 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆయన అరగంటలోనే 6 ట్యూన్లు ఇచ్చినట్టుగా దర్శకుడు రమేశ్ వర్మ చెప్పాడు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ .. "స్టేజ్ పై రవితేజ ఉన్నారు గనుక మనందరిలో మంచి ఎనర్జీ ఉంది. ఈ సినిమాను చాలా గొప్పగా .. చాలా ఖర్చు చేసి బ్యూటిఫుల్ గా తీశారు. కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు నాకు ఇంగ్లిష్ మూవీ చూస్తున్నట్టుగా అనిపించింది.

రవితేజగారి లుక్ సూపర్ గా ఉంది. బైక్ ఛేజింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. రమేశ్ గారు కథ చెబుతున్నప్పుడే అక్కడికక్కడే ట్యూన్ చేసేస్తే ఆయనకి బాగా నచ్చాయని అన్నారు .. అది ఆయనకి నాపై ఉన్న నమ్మకం. ఆయన అంతగా నన్ను నమ్మడంతో బాధ్యత పెరిగి భయం కూడా ఎక్కువైంది. అనసూయ గారు .. నేను మాకు తెలియకుండానే కలిసి ట్రావెల్ చేస్తున్నాము. ఈ సినిమాలో కూడా ఆమె పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆమె పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఆమె ఆ పాత్రను చేసిన తీరు నాకు బాగా నచ్చింది.

రమేశ్ గారు చెప్పినట్టుగా మీనాక్షి - డింపుల్ ఇద్దరికీ కూడా చాలామంది కేరక్టర్స్ పడ్డాయి. వాళ్ల పాత్రలను డిజైన్ చేసిన తీరు డిఫరెంట్ గా ఉంది. ఇద్దరూ కూడా స్క్రీన్ పై అదరగొట్టేశారు. అందరూ కూడా ఒక ఫ్యామిలీలా ట్రావెల్ చేయడాన్ని నేను చూశాను. నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది.

రవితేజ మాస్ ఇమేజ్ .. ఆయన స్టార్ డమ్ మనందరికీ తెలుసు. నాకు ఆయనలో బాగా నచ్చే విషయం ఏమిటంటే ఆయన పాజిటివిటీ. అందుకే ఆయనంటే నాకు చాలా ఇష్టం. కొంతమంది స్టార్స్ ను అంతా ఇష్టపడతారు .. అలాంటి అరుదైన స్టార్ రవితేజ గారు.

అందరూ కూడా ఆయనను తమ సొంత మనిషిలా భావిస్తుంటారు. ఎప్పుడైనా ఎవరైనా డల్ గా అనిపించినప్పుడు ఆయనకి ఒక కాల్ చేసి మాట్లాడితే చాలు .. డల్ నెస్ ఎగిరిపోతుంది. ఆయన ఎనర్జీ .. లైఫ్ ను ఆయన తీసుకునే తీరు నాకు బాగా నచ్చుతాయి. ఆయన ఎనర్జీని దృష్టిలో పెట్టుకునే సాంగ్స్ చేస్తుంటాము. మాస్ తో పెట్టుకుంటే మడతడిపోద్ది .. మాస్ మహారాజ్ తో సినిమా తీస్తే హిట్టైపోద్ది. ఆయనతో కలిసి ఈ సినిమా చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా థియేటర్స్ కి వెళ్లి ఎంజాయ్ చేయండి" అని చెప్పుకొచ్చాడు.