Begin typing your search above and press return to search.

రౌడీ స్టార్‌ గురించి అది గాలి వార్త మాత్రమే

By:  Tupaki Desk   |   12 July 2020 7:30 AM GMT
రౌడీ స్టార్‌ గురించి అది గాలి వార్త మాత్రమే
X
విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో ఒక చిత్రంను చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ దాదాపుగా సగం వరకు పూర్తి అయ్యింది. త్వరలో షూటింగ్‌ ను పున: ప్రారంభించి ఆ చిత్రాన్ని పూర్తి చేయాలని పూరి ఎదురు చూస్తున్నాడు. ఈ సమయంలోనే విజయ్‌ దేవరకొండ ఒక రీమేక్‌ చిత్రంలో కీలక పాత్రను చేసేందుకు ఓకే చెప్పాడు అంటూ వార్తలు వచ్చాయి. మెగాస్టార్‌ చిరంజీవి చేయబోతున్న లూసీఫర్‌ రీమేక్‌ లో విజయ్‌ దేవరకొండ ప్రత్యేక పాత్రకు ఓకే చెప్పాడని వార్తలు వచ్చాయి.

మీడియాలో గత వారం రోజులుగా వస్తున్న వార్తలకు క్లారిటీ వచ్చింది. విజయ్‌ దేవరకొండ సన్నిహితులు ఆ వార్తలను కొట్టి పారేశారు. ఇప్పటి వరకు అలాంటి చర్చ కూడా జరగలేదని రౌడీ స్టార్‌ టీం మెంబర్స్‌ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికి పూరి మూవీ తప్ప మరే సినిమాకు విజయ్‌ ఓకే చెప్పలేదని. ప్రస్తుతం కొన్ని స్క్రిప్ట్‌ లను మాత్రం వింటున్నట్లుగా పేర్కొన్నారు.

మెగా ఫ్యాన్స్‌ లూసీఫర్‌ రీమేక్‌ లో చిరంజీవితో పాటు విజయ్‌ దేవరకొండ కూడా ఉంటే బాగుంటుందని ఆశ పడ్డారు. కాని వారి ఆశ నిరాశే అయ్యింది. చిరంజీవి విజయ్‌ దేవరకొండల కాంబో మూవీ లేదనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. ముందు ముందు అయినా వీరి కాంబోలో మూవీ ఉంటుందేమో చూడాలి. ప్రస్తుతానికి అయితే వీరిద్దరిని కలిపి స్క్రీన్‌ పై చూడబోవడం లేదు. లూసీఫర్‌ రీమేక్‌ కు సాహో దర్శకుడు సుజీత్‌ తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.