Begin typing your search above and press return to search.

నిఖిల్ సినిమా స్ట్రిమింగ్ మొద‌ల‌య్యేది అప్పుడే!

By:  Tupaki Desk   |   26 Sep 2022 11:32 AM GMT
నిఖిల్ సినిమా స్ట్రిమింగ్ మొద‌ల‌య్యేది అప్పుడే!
X
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ న‌టించిన లేటెస్ట్ మిస్టిక్ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ 'కార్తికేయ 2'. చందూ మొండేటి డైరెక్ట్ చేసిన ఈ మూవీ రెండు ద‌ఫాలుగా రిలీజ్ వాయిదా ప‌డి ఫైన‌ల్ గా ఆగ‌స్టు 13న విడుద‌లై ఊహ‌కంద‌ని విధంగా పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచి షాకిచ్చింది. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్ గా న‌టించిన ఈ మూవీలోకి కీల‌క అతిథి పాత్ర‌లో బాలీవుడ్ పాపుల‌క్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అనుప‌మ్ ఖేర్ న‌టించారు.

ఉభ‌య తెలుగు రాష్ట్ర‌ల‌తో పాటు వ‌ర‌ల్డ్ వైడ్ గా తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో విడుద‌లైన ఈ మూవీ ఉత్త‌రాదిలో మాత్రం రికార్డు స్థాయి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ముందు చాలా త‌క్కువ థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ మూవీ వారం తిర‌క్కుండానే రికార్డు స్థాయి నంబ‌ర్ల‌కు చేర‌డం తెలిసిందే. ఉత్త‌రాదిలో హిందీ వెర్ష‌న్ రికార్డు స్థాయిలో రూ. 30 కోట్లు రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురిచేసింది.

హిందీలో నేరుగా విడుద‌లైన నిఖిల్ ఫ‌స్ట్ మూవీ ఇది. ఈ స్థాయిలో వ‌సూల్ల‌ని రాబ‌ట్టిన త‌న తొలి మూవీగా రికార్డుని సొంతం చేసుకుంది. అంతే కాకుండా వ‌ర‌ల్డ్ వైడ్ గా అన్ని భాష‌ల్లోనూ ఈ మూవీ రూ. 120 కోట్ల‌కు మించి వ‌సూళ్లిని రాబ‌ట్ట‌డం నిఖిల్ కెరీర్ లోనే ఓ సంచ‌ల‌నంగా చెబుతున్నారు. ఈ మూవీ కేవ‌లం నాలుగు వారాల్లోనే హిందీ బెల్ట్ లో లైఫ్ టైమ్ వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డం విశేషం. ఇదిలా వుంటే ఈ మూవీ ఊహించ‌ని విధంగా వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి నిఖిల్ ని వంద కోట్ల క్ల‌బ్ హీరోగా, పాన్ ఇండియా స్టార్ గా నిల‌బెట్టిన విష‌యం తెలిసిందే.

ఈ మూవీ సాధించిన వ‌సూళ్ల‌ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న నిఖిల్ ఇక‌పై త‌న ప్ర‌తీ సినిమా భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా వుండాల‌ని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే త‌ను న‌టిస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ 'స్పై' ని కూడా 'కార్తికేయ 2' త‌ర‌హాలో ఐదు భాష‌ల్లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడు. ఇదిలా వుంటే బాక్సాఫీస్ వ‌ద్ద వ‌ర‌ల్డ్ వైడ్ గా రికార్డులు సృష్టించిన 'కార్తికేయ 2' ఓటీటీలోనూ హంగామా చేయ‌డానికి రెడీ అవుతోంది.

ఈ మూవీ శాటిలైట్‌, ఓటీటీ హ‌క్కుల్ని జీ స్టూడియోస్ ద‌క్కించుకుంది. దీంతో ఈ మూవీ తెలుగు, ,త‌మిళ‌, భాష‌ల్లో జీ 5 లో స్ట్రీమింగ్ కాబోతోంది. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 5 నుంచి ఈ మూవీ జీ5లో మూడు భాష‌ల్లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంద‌ని తెలిసింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.