Begin typing your search above and press return to search.

నా లైఫ్ లో బిగ్ ఇన్సల్ట్ అదే: విశ్వక్ సేన్

By:  Tupaki Desk   |   21 Oct 2022 11:30 AM GMT
నా లైఫ్ లో బిగ్ ఇన్సల్ట్ అదే: విశ్వక్ సేన్
X
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవరిస్తున్న 'అన్‌ స్టాపబుల్ విత్ NBK' టాక్ షో రెండో సీజన్ ఇటీవలే ప్రారంభమైంది. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోకి ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. మొదటి ఎపిసోడ్ లో నారా తండ్రీకొడుకులు చంద్రబాబు నాయుడు - లోకేష్ లు గెస్టులుగా హాజరవ్వగా.. రికార్డ్ స్థాయిలో వ్యూయర్ షిప్ వచ్చింది. ఇక రెండో ఎపిసోడ్ లో యువ హీరోలు సిద్ధు జొన్నలగడ్డ - విశ్వక్‌ సేన్ సందడి చేసారు.

ఇప్పటికే 'అన్‌ స్టాపబుల్ 2' రెండో ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఆకట్టుకోగా.. ఈరోజు శుక్రవారం ఫుల్ ఎపిసోడ్ ను ఆహా ప్రసారం చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరియు 'డీజే టిల్లు' సిద్దు ఇద్దరూ కలిసి బాలయ్యతో సరదా సంభాషణ సాగించారు. బాలకృష్ణ ఎప్పటిలాగే ఓవైపు అల్లరి చేస్తూ మరోవైపు యంగ్ హీరోలపై ఫన్నీ సెటైర్స్ వేస్తూ అలరించారు.

రియల్ లైఫ్ లోనూ మంచి స్నేహాన్ని కలిగివున్న విశ్వక్ - సిద్ధు ఇద్దరూ ఈ ఎపిసోడ్ లో సినిమాలతో పాటుగా పలు ఆసక్తికర విషయాలని షేర్ చేసుకున్నారు. వీరితో పాటుగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా లైఫ్ లో బిగ్ ఇన్సల్ట్ ఏదని విశ్వక్ ను బాలకృష్ణ ప్రశ్నించారు. దీనికి విశ్వక్ సమాధానమిస్తూ.."రీసెంట్ గానే ఒక టీవీ ఛానల్ లో జరిగింది. బేసిక్ గా నాకు లైఫ్ లో ఎప్పుడైనా ఏదైనా ఇన్సల్ట్ జరిగితే దానికి తప్పకుండా జవాబు చెప్పో లేదా వారి బెండు తీసో వెళ్లే టైపు నేను" అని అన్నారు.

"కానీ లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఏమి చేయకుండా వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే నేను రియాక్ట్ అయితే వాళ్ళకీ మనకు తేడా ఏముంటది అనుకొని వాకౌట్ చేశా. కాకపోతే అందుకేనేమో ఈ విషయంలో ప్రజల నుంచి నాకు బాగా సపోర్ట్ వచ్చింది. అప్పుడు నాకు సపోర్ట్ చేసిన విషయాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను" అని విశ్వక్ సేన్ అన్నాడు. దీనికి బాలకృష్ణ స్పందిస్తూ.. 'నీకు ఒకటి చెప్తా విశ్వక్ సేన్.. ఒక్కోసారి ఏమైనా చేయడం కంటే.. చేయకుండా ఉండటం గొప్ప నిర్ణయం అవుతుంది' అని తెలిపారు.

కాగా, ఓ న్యూస్ ఛానల్ యాంకర్ కు విశ్వక్ సేన్ కు మధ్య అప్పట్లో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. 'అశోకవనంలో అర్జున కల్యాణం' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ ఓ ప్రాంక్ వీడియో చేయడం.. పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్న పాగల్ సేన్ అంటూ దీనిపై టీవీ ఛానల్ లో డిబేట్ పెట్టడంతో ఈ వివాదం మొదలైంది. లైవ్ డిబేట్ లో విశ్వక్ ను 'పాగల్ సేన్' 'డిప్రెస్డ్ మ్యాన్' అంటూ వ్యక్తిగతంగా ఎటాక్ చేయడంతో.. సదరు యాంకర్ పై యువ హీరో ఆగ్రహం వ్యక్తం చేసాడు.

అయితే సహనం కోల్పోయిన యాంకర్ అతన్ని 'గెటౌట్' అంటూ షో నుంచి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేసింది. దీంతో విశ్వక్ నోటికి పని చెబుతూ 'F**' అనే పదాన్ని వాడటం.. 'వెధవ.. గెటవుట్' అంటూ యాంకర్ మళ్లీ గట్టి గట్టిగా అరవడం ఆ మధ్య హాట్ టాపిక్ అయింది. ఇందులో తప్పొప్పుల విషయంలో అనేక వాదనలు వినిపించినా.. విశ్వక్ సేన్ కే ఎక్కువ మద్దతు లభించింది. ఆ తర్వాత ఈ వివాదం గురించి ఎక్కడా మాట్లాడని విశ్వక్.. ఇన్నాళ్లకు 'అన్‌ స్టాపబుల్ 2' వేదికగా అది తన లైఫ్ లో అతి పెద్ద అవమానంగా పేర్కొన్నాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.