Begin typing your search above and press return to search.

సర్కారు పాటలో ఆ సీక్వెన్స్ ప్లస్ కాబోతుందట!

By:  Tupaki Desk   |   11 Feb 2021 9:49 AM GMT
సర్కారు పాటలో ఆ సీక్వెన్స్ ప్లస్ కాబోతుందట!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ కాంబినేషన్ లో 'సర్కారు వారి పాట' సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ దగ్గర సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు. పరశురామ్ - మహేష్ కాంబినేషన్ కొత్తగా ఉండబోతుందని ఇండస్ట్రీ టాక్. నిజానికి 'సర్కారు వారి పాట' టైటిల్ తోనే విపరీతంగా బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన పోస్టర్లకు ప్రేక్షకుల నుండి ఓ రేంజిలో స్పందన లభించింది. ఈ సినిమాలో మ‌హేష్ లాంగ్ హెయిర్, లైట్ బియర్డ్ తో ఇంత‌క ముందెప్పుడూ చూడని మాస్ లుక్‌లో కనిపించి కిక్ ఇవ్వనున్నాడు. ఈ మూవీ బ్యాంకు కుంభకోణాల నేపథ్యంలో సామాజిక అంశాలను చర్చలోకి తీసుకొస్తుందని టాక్ నడుస్తుంది.

ఈ సినిమాలో మహేష్ స్టైలిష్ బ్యాంకు మేనేజరుగా కనిపించనున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. పరశురామ్ టీమ్ ఈ సినిమాకోసం మంచి కామెడీ సీక్వెన్స్ రాశారట. దూకుడు సినిమాలో లాగే ఈ సినిమాకు కూడా ఆ కామెడీ సీక్వెన్స్ ప్లస్ అవుతుందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాకోసం సిటీలో బ్యాంకు సెట్ రెడీ చేశారట. బడ్జెట్ భారీగానే పెడుతున్నారు ప్రొడ్యూసర్స్. ప్రస్తుతం దుబాయ్ లో షెడ్యూల్ జరుగుతుంది. అయితే ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ రొమాన్స్ చేయనుంది. అయితే ఈసారి మహేష్ సర్కారి వారి పాటతో డిఫరెంట్ లుక్కులో అలరించనున్నాడని అర్ధమవుతుంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను మైత్రి మూవీస్ తో పాటు జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, 14రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మిస్తున్నాయి.