Begin typing your search above and press return to search.

ఆ ప్రొడ్యూసర్ నన్ను ప్రెగ్నెంట్ చేసి వదిలేసాడు: ప్రముఖ సింగర్

By:  Tupaki Desk   |   25 May 2021 8:30 AM GMT
ఆ ప్రొడ్యూసర్ నన్ను ప్రెగ్నెంట్ చేసి వదిలేసాడు: ప్రముఖ సింగర్
X
గ్లామర్ ప్రపంచంలో లైంగిక వేధింపుల గురించి కొన్నేళ్లుగా మీటూ అనే ఉద్యమం ద్వారా హీరోయిన్స్ క్యారెక్టర్ ఆర్టిస్టులు వారి ఎదుర్కొన్న బ్యాడ్ ఇన్సిడెంట్స్ గురించి ధైర్యంగా నోరు విప్పుతున్నారు. ఇప్పుడేదో న్యాయం జరుగుతుందని కాదు. చెప్పాల్సిన సందర్బం వస్తే.. మిగతా ఫ్యూచర్ లేడీ యాక్టర్స్ ధైర్యంగా ఉండాలని వారు బయట పెడుతున్నారు. అయితే రీసెంట్ గా పాపులర్ ఇంగ్లీష్ పాప్ సింగర్ లేడీగాగ.. ఆమె జీవితంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఓ టాక్ షోలో బయటపెట్టేసింది. అయితే మానసిక ఆరోగ్యం గురించి నిజాయితీగా చర్చించడానికి ఓప్రా విన్ఫ్రే - ప్రిన్స్ హ్యారీ సంయుక్తంగా ఆపిల్ టీవీలో నిర్వహిస్తున్న 'ది మీ యూ కాంట్ సీ' షో ఇంటర్వ్యూలో లేడీగాగ ఈ విషయాలు చెప్పింది.

ఆమె మాట్లాడుతూ.. తాను 19ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ ప్రొడ్యూసర్ తన పై అత్యాచారం చేసి ప్రెగ్నెంట్ చేసాడని చెప్పింది లేడీ. ఆ సమయంలో తాను ఎంతో మానసిక క్షోభకి గురైనట్లు చెబుతూ ఎమోషనల్ అయిపోయింది. అయితే ఇదంతా తాను అప్పుడప్పుడే మ్యూజిక్ ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు జరిగిందని చెప్పింది. జరిగిన ఇన్సిడెంట్ గురించి చెబుతూ.. "నేను అప్పుడు బిజినెస్ లో పని చేస్తున్నాను. ఆ టైంలో ఓ ప్రొడ్యూసర్ నన్ను బట్టలు విప్పేయ్ అన్నాడు. నేను షాక్ అయిపోయి అక్కడి నుండి వెళ్ళబోయాను. అప్పుడు వారు నా మ్యూజిక్ ఆల్బమ్స్ అన్ని కాల్చేస్తామని బెదిరించారు. నేను అక్కడే నిలబడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు గుర్తులేదని ఈ విషయం 2014లో మొదటగా ఈ విషయం బయటపెట్టింది.

ఫస్ట్ నేను చాలా నొప్పి నరకం అనుభవించాను. ఆ తర్వాత మైండ్ మొద్దు బారిపోయింది. అలా కొన్ని వారాలపాటు నేను ఆరోగ్యం క్షినించి అనారోగ్యంతో వేదన అనుభవించాను. అలా నాపై అత్యాచారం జరిపి నన్ను ఓ మూలకు పడేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత చాలా ఏళ్ల వరకు నేను మాములు స్థితికి రాలేకపోయానని తెలిపి.. వారి పేర్లు బయట పెట్టడానికి నిరాకరించింది లేడీ. నాకు మీటూ ఉద్యమం గురించి బాగా తెలుసు. కానీ ఇప్పుడు వారి పేర్లు బయటపెడితే మాత్రం కొందరికి హ్యాపీగా ఉంటుందేమో కానీ నాకు ప్రశాంతత కరువు అవుతుంది. అందుకే లైంగికంగా దాడి చేసిన ఆ ప్రొడ్యూసర్ నేమ్ చెప్పనని తేల్చి చెప్పేసింది. ఇక 2012లో లేడీ గాక మానసిక సమస్యలతో బాధ పడుతున్న లేడీస్ కోసం 'బోర్న్ ది వే' అనే ఫౌండేషన్ స్థాపించినట్లు చెప్పుకొచ్చింది. ఈ విధంగా లేడీగాగ తన లైఫ్ లో బ్యాడ్ డేస్ గురించి తెలిపింది.