Begin typing your search above and press return to search.

ఆ మల్టీస్టారర్‌ మూవీ 'బుట్టబొమ్మ'

By:  Tupaki Desk   |   24 March 2021 7:34 AM GMT
ఆ మల్టీస్టారర్‌ మూవీ బుట్టబొమ్మ
X
మలయాళంలో సెన్షేషనల్‌ సక్సెస్ ను దక్కించుకున్న కప్పెల సినిమా ను తెలుగులో సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్‌ వారు రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. యంగ్‌ హీరోలు నవీన్ చంద్ర మరియు విశ్వక్ సేన్ లు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా అజిత్ కు రీల్‌ కూతురుగా పేరు దక్కించుకున్న అనిక సురేంద్రన్‌ ను నటింపజేస్తున్నట్లుగా ఆమద్య వార్తలు వచ్చాయి. తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఈ సినిమా స్క్రిప్ట్‌ ను మార్చే పనిలో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ రీమేక్ కు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్‌ మెంట్స్ వారు ఈ రీమేక్ కోసం 'బుట్ట బొమ్మ' అనే టైటిల్‌ ను రిజిస్ట్రర్‌ చేయించారట. కథకు తగ్గట్లుగా బుట్ట బొమ్మ సరిగ్గా సూట్‌ అవుతుందని భావిస్తున్నారట. గత ఏడాది కాలంగా బుట్టబొమ్మ పదం ఎంతగా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అల వైకుంఠపురంలో సినిమాలోని బుట్టబొమ్మ పాట సౌత్‌ ఇండియాలోనే టాప్‌ సాంగ్‌ గా యూట్యూబ్‌ లో నిలిచింది. గత ఏడాది మొత్తం కూడా ట్రెండ్డింగ్ లో నిలిచిన పాట కూడా బుట్ట బొమ్మ. అందుకే బుట్టబొమ్మ టైటిల్‌ సినిమా కు ఖచ్చితంగా మంచి పబ్లిసిటీగా నిలుస్తుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే రావాల్సి ఉంది.