Begin typing your search above and press return to search.

పెట్టుబడి రాకున్నా పర్వాలేదు థియేట్రికల్ రిలీజే ముద్దా?

By:  Tupaki Desk   |   19 May 2020 5:00 AM IST
పెట్టుబడి రాకున్నా పర్వాలేదు థియేట్రికల్ రిలీజే ముద్దా?
X
థియేటర్లు మూతపడి ఉండడంతో థియేట్రికల్ రిలీజులకు పెద్ద కష్టం వచ్చిపడింది. ఇతర భాషలలో ఓటీటీ రిలీజుల వైపు కొందరు నిర్మాతలు మొగ్గుచూపుతున్నారు కానీ తెలుగులో మాత్రం ఎక్కువమంది థియేట్రికల్ రిలీజు మాత్రమే చేస్తామని పట్టుబట్టి కూర్చోవడం ఇండస్ట్రీలోనే చాలమందికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈమధ్య ఒక సినిమాకు మంచి ఆఫర్ వచ్చినా కానీ ఆ సినిమాను రిలీజ్ చెయ్యకుండా లేనిపోని పంతానికి పోతున్నారని అంటున్నారు.

అదో థ్రిల్లర్ సినిమా. థియేటర్ల తలుపులు ఫుల్లుగా తెరిచి ఉన్న సమయంలో రిలీజ్ కావాల్సింది. కానీ ఎందుకో కానీ ఆలస్యం అయింది. తీరా రిలీజ్ చేద్దామని టీమ్ సిద్ధం అయింది. అయితే ఆ థియేటర్ల తలుపులకు తాళాలు పడ్డాయి. క్రేజ్ ఉన్న సినిమా కావడంతో ఒక ఓటీటీ ప్లాట్ ఫామ్ వారు డైరెక్ట్ డిజిటల్ రిలీజుకు రూ. 15 కోట్లు ఆఫర్ చేశారట. ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాకు అయిన ఖర్చు 12 కోట్లే. ఇక నిర్మాతలకు డిజిటల్ రైట్స్ మాత్రమే కాకుండా ఇతర రైట్స్ ద్వారా కూడా ఆదాయం వస్తుంది.

అయినా థియేట్రికల్ రిలీజుకు మాత్రమే వెళ్తామని మొండిగా వ్యవహరిస్తున్నారట. ఇది సరైన పద్ధతి కాదని.. నిర్మాత సేఫ్ అయిన పక్షంలో ఎలాంటి రిలీజ్ అయినా ఒకే అని.. ఇదే థియేట్రికల్ రిలీజుకు పోతే పెట్టుబడి వెనక్కు వస్తుందని ఎవరైనా హామీ ఇవ్వగలరా అంటూ ఒక సీనియర్ నిర్మాత అభిప్రాయపడ్డారు.