Begin typing your search above and press return to search.

కరోనా టైంలో యంగ్ ప్రొడ్యూసర్స్ వస్తున్నారంటే కారణం అదే...!

By:  Tupaki Desk   |   16 Aug 2020 11:00 AM IST
కరోనా టైంలో యంగ్ ప్రొడ్యూసర్స్ వస్తున్నారంటే కారణం అదే...!
X
సినీ ఇండస్ట్రీ గత నాలుగున్నర నెలలుగా క్లోజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్మాతలు పెద్ద ఎత్తున నష్టాలను చవి చూస్తున్నారు. అయినా సరే టాలీవుడ్ లో మాత్రం యంగ్ ప్రొడ్యూసర్స్ న్యూ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ వస్తున్నారు. అయితే వీరంతా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ఉన్నాయనే ధైర్యంతోనే సినిమాలు తీస్తున్నారని చెప్పవచ్చు. ఒకప్పుడు చిన్న నిర్మాతలు కొత్త నటీనటులతో స్మాల్ బడ్జెట్ లో సినిమాలు తీసి.. వాటిని థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి నానా అవస్థలు పడేవారు. థియేటర్స్ మాఫియా మరియు పెద్ద ప్రొడ్యూసర్స్ అండదండలు లేకుండా చిన్న సినిమాలు విడుదల చేయలేము అనే కామెంట్స్ వినిపిస్తుండేవి. కానీ ఇప్పుడు పద్ధతి మారింది.

దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన ఇప్పుడప్పుడే సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో రిలీజ్ కి రెడీ అయిన మూవీస్ అన్ని డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ ఓటీటీలలో రిలీజ్ అవుతున్నాయి. పెద్ద మూవీస్ ఓటీటీలో వర్కౌట్ అవుతాయో లేదో అనే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో చిన్న సినిమాలు మాత్రం ఓటీటీలను నమ్ముకొని లాభాలు పొందుతున్నాయి. అందుకే ఫ్యూచర్ లో చిన్న సినిమాలకి థియేటర్స్ దొరకకపోయినా ఓటీటీలు ఉన్నాయనే ధైర్యంతో చిన్న నిర్మాతలు సినిమాలు చేసేస్తున్నారు. అయితే ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్స్ కూడా ఓటీటీలో పాగా వెయ్యాలని చూస్తున్నారు. రిటర్న్స్ తక్కువగా ఉన్నప్పటికీ ఫ్యూచర్ బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఓటీటీల వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ క్రియేట్ చేయగా.. మరికొందరు అదే ఆలోచనలో ఉన్నారు.

ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఓటీటీలు అనేవి థియేటర్స్ లా కంట్రోల్ చేయలేరని అర్థం అవుతోంది. ఒకవేళ ఫ్యూచర్ లో ఓటీటీలు ఇంకా పుంజుకొని.. ప్రేక్షకులకు ఓటీటీలకు అలవాటు పడి సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత ఈ కార్పొరేట్ మాఫియా వారు తమ బిజినెస్ లో భాగంగా చిన్న సినిమాలపై ఆధిపత్యం చెలాయించడానికి ఏమైనా ప్రయత్నాలు స్టార్ట్ చేస్తారేమో చెప్పలేం. కాకపోతే అలాంటి సిచ్యుయేషన్స్ లో కూడా చిన్న నిర్మాతలకు ఏటీటీ అనే మరో ఆప్షన్ ఎలాగూ ఉంది. వారే ఓన్ ప్లాట్ ఫార్మ్ క్రియేట్ చేసుకొని తమ సినిమాని పే పర్ వ్యూ విధానంలో రిలీజ్ చేసుకోవచ్చు. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ ఈ విధానానికి బాటలు వేశారు. ఇటీవల షకీలా సినిమాని టికెట్ ధర పెట్టి ఆన్లైన్ లో రిలీజ్ చేసారు. ఈ నేపథ్యంలో చిన్న సినిమాలు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో లేదా ఏటీటీలలో రిలీజ్ చేయడానికైనా పనికొస్తాయని మేకర్స్ ఆలోచిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో అనుకుంటున్నారు.