Begin typing your search above and press return to search.

ఆ డైరెక్టర్ 'ఎక్స్-లైఫ్' స్టోరీ.. ప్రభాస్ మూవీని జడ్జ్ చేయనుందా..?

By:  Tupaki Desk   |   18 Feb 2021 8:00 AM IST
ఆ డైరెక్టర్ ఎక్స్-లైఫ్ స్టోరీ.. ప్రభాస్ మూవీని జడ్జ్ చేయనుందా..?
X
హిందీ మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ 'లస్ట్ స్టోరీస్'.. దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు తెలిసే ఉంటుంది. ముఖ్యంగా యూత్ తప్పకుండా చూసే ఉంటుంది. నెట్ ఫ్లిక్స్‌ ఇండియా విడుదల చేసిన బోల్డ్ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్. బోల్డ్ కంటెంట్ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి నెట్ ఫ్లిక్స్ ఎల్లప్పుడూ సిద్ధమే. ఇప్పుడు అదే నెట్ ఫ్లిక్స్ వారు లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ ను తెలుగులో పిట్టకథలు పేరుతో విడుదల చేయనుంది. నాలుగు మినీ కథలు కలిగిన ఈ వెబ్ సిరీస్ లో భార్యభర్తల మధ్య బంధాలు, సంసారంలో కలిగే సమస్యలు, ఇష్టాయిష్టాలు, అలకలు ఇలాంటి అన్ని విషయాలు మేళవించి అందించనున్నారు మేకర్స్. హిందీలో ఘాటు సన్నివేశాలు కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. మరి తెలుగు పిట్టకథలు కూడా ఘాటుగానే ఉండబోతున్నాయని టీజర్ చూస్తే అర్ధమవుతుంది.

ఇదిలా ఉండగా.. ఇందులో నాలుగు స్టోరీలకు నలుగురు దర్శకులు. తరుణ్ భాస్కర్ 'రాములా', నందిని రెడ్డి 'మీరా', సంకల్ప్ రెడ్డి 'పుస్తకం' స్టోరీలతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ఎక్స్-లైఫ్'. అయితే ఈ నాలుగు కథలలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన 'ఎక్స్-లైఫ్' బాగా చర్చలలో నిలుస్తోంది. శృతిహాసన్, సంజిత్ హెగ్డే నటించిన ఈ ఎక్స్-లైఫ్ స్టోరీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఎందుకంటే బ్లాక్ బస్టర్ మహానటి మూవీ తర్వాత నాగ్ అశ్విన్ నుండి వస్తున్న ప్రాజెక్ట్ ఇది. అలాగే దీని తర్వాత నాగ్ డార్లింగ్ ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ రూపొందించనున్నాడు. మరి ఎక్స్-లైఫ్ స్టోరీకి నాగ్ ఎంతవరకు న్యాయం చేసాడో తెలిస్తేనే ప్రభాస్ అభిమానులు నెక్స్ట్ సినిమా పై ఓ అంచనాకు రాగలరని టాక్. మరి నాలుగు పిట్టకథలలో నాగ్ అశ్విన్ కథ మోస్ట్ సక్సెస్ అవుతుందా లేదా చూడాలి! ఫిబ్రవరి 19న పిట్టకథలు వెబ్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో విడుదల అవుతోంది.