Begin typing your search above and press return to search.
అరే! కథ ఇదీ అంటూ లీకులిచ్చారు!!
By: Tupaki Desk | 29 Jun 2020 10:15 AM ISTప్రస్తుత మహమ్మారీ సన్నివేశంలో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాల భవితవ్యం ఏమిటో అర్థం కాని పరిస్థితి. ఎప్పటికి రిలీఫ్ దక్కేను? ఎప్పటికి రిలీజయ్యేను? అన్న తీరుగా ఉంది. దీంతో పలువురు ఓటీటీల్లో తమ సినిమాల్ని రిలీజ్ చేసేస్తున్నారు. ఇప్పటికే 20 సినిమాలు క్యూలో ఉన్నాయి. అయితే ఇవి పెద్ద తెర లేదా ఓటీటీలో రిలీజ్ కి వచ్చే లోపే రకరకాలుగా లీకయ్యే పరిస్థితి కనిపిస్తోంది.
సినిమా క్లిప్పింగులేవీ రాలేదు కానీ.. క్రేజీ థ్రిల్లర్ మూవీ అని భావిస్తున్న ఓ సినిమా కథను లీక్ చేసేయడం చర్చకొచ్చింది. ఇద్దరు యంగ్ ఎనర్జిటిక్ హీరోలు నటిస్తున్న థ్రిల్లర్ మూవీ కథ ఇదీ అన్న ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియాల్లో వేడెక్కిస్తోంది. ఇంతకీ ఏమిటా కథ? అంటే..
ఇందులో ఒకరు హీరో అయితే ఇంకొకరు విలన్. ఒకరి వెంట ఒకరు పడుతూ ఎలుకా పిల్లి ఆట ఆడుతుంటారు. జన సందోహంలో విధ్వంశం సృష్టిస్తుంటారు. అయితే ఇలా చూస్తున్న ఆడియెన్ కి ట్విస్టేమంటే ఇందులో సడెన్ గా ఇద్దరు హీరోలు .. ఇద్దరు విలన్లు ప్రత్యక్షమవుతారు. దీంతో ఆడియెన్ ఎగ్జయిట్ మెంట్ పీక్స్ కి చేరుకుంటుంది. ఇందులోనూ పునర్జన్మలు అన్న కాన్సెప్ట్ మరింత రక్తి కట్టిస్తుందట.
ఇక ఒక జన్మలో ఒకరు హీరో అయితే ఇంకో జన్మలో అతడే విలన్. ఆ ఇద్దరిదీ సేమ్ టు సేమ్ రిపీట్ సన్నివేశం ఉంటుంది. కథ వింటుంటేనే గగుర్పొడుస్తోంది కదూ! థ్రిల్లర్ నేపథ్యంలో మూవీ రెడీ అయ్యింది. రిలీజ్ కి వెయిటింగ్. మరి క్రైసిస్ రాకపోయి ఉంటే ఇలాంటి క్రేజీ స్టోరీతో వస్తున్న మూవీని పెద్ద తెరపై వీక్షించేవారే. ఇంత ఆలస్యం అయ్యేది కాదు. కథ వింటుంటేనే బ్లాక్ బస్టర్ ఖాయం అన్నట్టుగా ఉంది. ప్చ్.. జనాలకు చూసే అదృష్టం దక్కడం లేదు ఇంకా. మరి ఇప్పుడు వస్తున్నాం అని అన్నా కానీ ! ఏమో ఏం అవుతుందో చూడాలి..!