Begin typing your search above and press return to search.
ఆ చిన్నారి ప్రేమ.. నా గుండెను తాకిందిః చిరంజీవి
By: Tupaki Desk | 1 Jun 2021 10:00 PM IST''చిన్నారి అన్షీ చేసిన పని, తను చూపిన ప్రేమ.. నా గుండెను తాకింది'' అంటూ మెగా ప్రశంసలు కురిపించారు చిరంజీవి. ఇంతకీ ఆ బేబీ ఏం చేసిందనేగా మీ డౌట్. తన చిట్టి గుండెలో ప్రపంచంపై, మనుషులపై ఎంత ప్రేమ ఉందో చాటుకుంది.
జూన్ 1న బేబీ అన్షీ ప్రభల బర్త్ డే. తన పుట్టిన రోజు సెలబ్రేషన్స్ కోసం తల్లిదండ్రులు ఖర్చు చేద్దామనుకున్న డబ్బులతోపాటు తాను కొంత కాలంగా దాచుకున్న డబ్బులను సైతం మెగాస్టార్ ఆక్సీజన్ బ్యాంకుల నిర్వహణ కోసం ఇచ్చేసింది. ఆ పాప చేసిన పనికి ముగ్ధుడయ్యారు చిరంజీవి. ఈ మేరకు ఓ వీడియో ద్వారా ఆ చిన్నారిని అభినందించారు.
ఆ వీడియోలో ''శ్రీనివాస్ , శ్రీమతి హనీ గార్ల చిన్నారి కూతురు పేరు అన్షీ ప్రభల. జూన్ 1న తన బర్త్ డే. తాను దాచుకున్న డబ్బులతోపాటు తన పుట్టిన రోజుకు అయ్యే ఖర్చులను కూడా చిరంజీవి ట్రస్ట్ తలపెట్టిన చిరంజీవి ఆక్సీజన్ బ్యాంక్స్ కోసం ఇచ్చేసింది. ఈ సందర్భంగా తనేం అంటుందంటే.. తన చుట్టూ ఉన్న ప్రపంచం బాగున్నప్పుడే అది నిజమైన సంతోషం అని. ఆ చిన్నారి ఆలోచనకు, మంచి మనసుకు తను వ్యక్తం చేసిన ప్రేమకు నిజంగా ముగ్ధుడినయ్యాను. అన్షీ చూపిన స్పందన నా హృదయాన్ని తాకింది. వండర్ ఫుల్ కిడ్.. గాడ్ బ్లెస్ యూ అన్షీ. హ్యాపీ బర్త్ డే.. లవ్యూ డార్లింగ్'' అని అన్నారు చిరు.

కాగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆక్సీజన్ బ్యాంకులను ఏర్పాటు చేస్తూ.. కొవిడ్ బాధితులకు అండగా చిరంజీవి అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ.30 కోట్ల వ్యయంతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిన్నారి స్పందన ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని అంటున్నారు చిరు.