Begin typing your search above and press return to search.
ఆ క్యారెక్టర్ నా 'కంబ్యాక్'కు బెస్ట్ అనిపించింది: ప్రియమణి
By: Tupaki Desk | 31 May 2021 5:07 PM ISTఇండస్ట్రీపరంగా సోషల్ మీడియా అభిమాన సినీసెలబ్రిటీలను ఎంత దగ్గర చేస్తుందో అందరికి తెలిసిందే. ఎందుకంటే సోషల్ మీడియాలో హీరోలకంటే కూడా హీరోయిన్స్ పైనే మక్కువ చూపిస్తుంటారు కుర్రకారు. అప్పుడప్పుడు తమ అభిమాన హీరోయిన్ కొత్త సినిమాలు వాటి విశేషాలు గురించి తెలుసుకునేందుకు ఆరాటపడుతుంటారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఏదొక విధంగా ఇబ్బందులకు కూడా గురి చేస్తుంటారు. అంటే అందరి విషయంలో ఇలాగే జరుగుతుందని కాదు. కానీ కొందరికి మాత్రం ఇబ్బందులు తప్పట్లేదు. ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ అంటూ సోషల్ మీడియా అన్ని ఖాతాలలో హీరోయిన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వడం లేదా లేటెస్ట్ ఫోటోషూట్స్ పోస్ట్ చేయడం లాంటివి చేస్తుంటారు.
అలా పోస్ట్ చేసినప్పుడు ఫ్యాన్స్ అయినా ఫాలోయర్స్ అయినా లైక్ కొట్టి ఊరుకుంటే సరిపోతుంది. లేదా అంతగా నచ్చితే కామెంట్ కూడా అందంగానే ఇబ్బంది కలగకుండా పెట్టాలి. అందులోను హీరోయిన్ విషయం కాబట్టి ఫ్యాన్స్ ఆత్రం మాములుగా ఉండదు. ఇటీవలే తాజాగా అలాంటి బ్యాడ్ కామెంట్ ఎదుర్కొంది హీరోయిన్ ప్రియమణి. కొన్నేళ్లుగా తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ప్రియమణి.. ఈసారి స్ట్రాంగ్ కంబ్యాక్ సెట్ చేసుకుందని చెప్పాలి. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ రెండు సినిమాలతో ప్రారంభించనుంది. ఆ సినిమాలు కూడా ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోల సినిమాలు కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ప్రస్తుతం తెలుగులో ప్రియమణి.. దగ్గుబాటి హీరోలు వెంకటేష్ సరసన నారప్ప మూవీతో పాటు రానా 'విరాటపర్వం' సినిమాలో కీలకపాత్ర పోషిస్తుంది.
ఇదిలా ఉండగా.. ప్రియమణి ఎంత టాలెంటెడ్ యాక్ట్రెస్ అనేది తెలిసిందే. మరి అలాంటి యాక్ట్రెస్ చాలకాలం తర్వాత అంటే 8ఏళ్ల తర్వాత టాలీవుడ్ లో న్యూ మూవీస్ చేస్తోంది. చండి అనే సినిమాలో ప్రియమణి చివరిగా కనిపించింది. ఆ తర్వాత ఓ డబ్బింగ్ సినిమాలో మెరిసింది. అయితే ఇన్నేళ్లు ఇండస్ట్రీలోనే ఉంది కానీ ఒక్కసారి కూడా వెంకటేష్ సరసన సినిమా చేయలేకపోయింది. ఈ విషయం గురించి తాజాగా స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. ఇదివరకు కూడా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఏవో కారణాల వలన అది వర్కౌట్ కాలేదు. కానీ ఈసారి అలా వెంకటేష్ సినిమాలో ఛాన్స్ అనగానే ఓకే చెప్పేసాను. అందులోను కంబ్యాక్ చేయడానికి ఇదే బెస్ట్ అనిపించిందని చెప్పింది ప్రియమణి. అలాగే రానా విరాటపర్వం సినిమాలో కూడా తాను నక్సలైట్ భారతక్క అనే కీలక రోల్ ప్లే చేసినట్లు తెలిపింది.