Begin typing your search above and press return to search.

తెగ వైరల్ అయిన హీరో-హీరోయిన్ ఘాటు రొమాన్స్

By:  Tupaki Desk   |   1 April 2019 11:35 AM GMT
తెగ వైరల్ అయిన హీరో-హీరోయిన్ ఘాటు రొమాన్స్
X
బాలీవుడ్లో స్టార్లు చాలామందే ఉంటారు కానీ వారిలో ఫర్హాన్ అఖ్తర్ మాత్రం చాలా స్పెషల్. మల్టీ టాలెంటెడ్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం అతడు. దర్శకుడిగా.. నిర్మాతగా.. హీరోగా.. సింగర్ గా ఇలా అన్నీ రకాలుగా తన సత్తా చాటాడు. నలభై ఐదేళ్ళ ఫర్హాన్ మూడేళ్ళ క్రితం తన భార్య అధున కు విడాకు ఇచ్చాడు. ఈ జంటకుఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక డైరెక్ట్ గా టాపిక్ లోకి వెళ్తే ఫర్హాన్ గత కొంతకాలంగా బాలీవుడ్ నటి 38 ఏళ్ళ షిబాని దండేకర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నాడు.

ఈ జంట చెట్టాపట్టాలేసుకొని తిరగడం.. మీడియా కంటపడడం చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు బాలీవుడ్ సాగుతున్న రెడ్ హాట్ ప్రేమాయణాల్లో ఇదొకటి. కొద్దిరోజుల క్రితం ఒక టీవీ షోలో తమ రిలేషన్ గురించి ఓపెన్ అయిన ఫర్హాన్ ఏప్రిల్ లేదా మేలో పెళ్లి చేసుకునే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఈమధ్య ఫర్హాన్ - షిబాని జంట చేసిన ఘాటు రొమాన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. కొంత కాలం క్రితం ఈ జంట వెకేషన్ కోసం మెక్సికోకు వెళ్లారట. అక్కడ ఇద్దరూ బీచిలో తెగ రొమాన్స్ చేసి కుర్రజంటగా మారిపోయారు. ఆ ఫోటోలే ఇవి.

ఒక ఫోటోలో బీచ్ లో సముద్రపు నీటిలో షిబానిని తన బాహువుల్లో బంధించాడు ఫర్హాన్ .. అఖ్తర్ సాబ్ గారి ఉడుంపట్టు తట్టుకోలేని షిబాని అదోరకం ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఇంతకంటే ఎక్కువగా ఎక్స్ ప్లెయిన్ చేస్తే అదో శృంగార కావ్యం అయ్యేలా ఉంది కాబట్టి ఆపేద్దాం. మీరు ఫోటోలు చూసి తరించండి. ఈ ఫోటోలు చూసి నెటిజనులు తట్టుకోలేక షేర్లతో లైకులతో హోరెత్తిస్తున్నారు.

సినిమాల విషయానికి వస్తే ఫర్హాన్ త్వరలో ప్రియాంక చోప్రాతో కలిసి 'ది స్కై ఈజ్ పింక్' అనే హాలీవుడ్ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. షిబాని విషయానికివస్తే 'క్వీన్' తెలుగు రీమేక్ 'దట్ ఈజ్ మహాలక్ష్మి' సినిమాలో ఒక కీలక పాత్రలో నటించింది. ఒరిజినల్ 'క్వీన్' లో లిసా హేడెన్ పోషించిన పాత్రే అది.