Begin typing your search above and press return to search.

ప్రొడ్యూసర్ గా మారుతున్న ఒకప్పటి లవర్‌ బాయ్..!

By:  Tupaki Desk   |   30 Oct 2020 11:30 PM GMT
ప్రొడ్యూసర్ గా మారుతున్న ఒకప్పటి లవర్‌ బాయ్..!
X
టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన తరుణ్.. 'నువ్వే కావాలి' సినిమాతో హీరోగా మారాడు. కెరీర్ ప్రారంభంలో వరుస సినిమాలతో హిట్లు కొట్టి లవర్ బాయ్ ఇమేజ్ ని సొతం చేసుకుని ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ సెట్ చేశాడు. పాతికేళ్ల వయసులోనే సూపర్ హిట్స్ అందుకున్న తరుణ్.. 'నువ్వులేక నేను లేను' 'నువ్వే నువ్వే' 'ప్రియమైన నీకు' 'ఎలా చెప్పను' 'నీ మనసు నాకు తెలుసు' 'శశిరేఖా పరిణయం' వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించాడు. అయితే ఆ తర్వాత వరుస వరుస అపజయాలు కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టాయి. ఎన్ని ప్రయోగాలు చేసినా లాభం లేకపోవడంతో సినిమాలను పక్కన పెట్టి బిజినెస్ పై దృష్టి పెట్టాడు. ఈ క్రమంలో తాజాగా తరుణ్ నిర్మాతగా మారుతున్నట్లు వెల్లడించాడు.

ఇటీవలే హీరోగా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న తరుణ్.. ఇప్పుడు ప్రొడక్షన్ పై కూడా దృష్టి సారించనున్నాడు. త్వరలోనే మూడు ప్రాజెక్టులను నిర్మించబోతున్నట్లు తరుణ్ పేర్కొన్నాడు. వాటిలో రెండు ప్రాజెక్ట్స్ ఓటీటీల కోసం రూపొందించే వెబ్‌ సిరీస్ లు కాగా.. మరొకటి తాను హీరోగా నటించనున్న సినిమా అని తెలిపాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్స్ సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని.. డైరెక్టర్స్ సెట్ చేయబడ్డారని.. త్వరలో వీటికి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటిస్తానని తరుణ్ పేర్కొన్నాడు. వెబ్ షోలు చేయడం సరైందేనని.. ఇటీవలి కాలంలో అనేక షోలను తిరస్కరించానని.. రాబోయే రోజుల్లో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నానని తరుణ్ చెప్పుకొచ్చాడు.