Begin typing your search above and press return to search.

రివ్యూలపై తరుణ్ భాస్కర్ కామెంట్స్

By:  Tupaki Desk   |   3 July 2018 5:21 AM GMT
రివ్యూలపై తరుణ్ భాస్కర్ కామెంట్స్
X
టాలీవుడ్ లో గత కొంత కాలంగా రివ్యూల గురించి ఎదో ఒక సందర్భంలో చాలా హాట్ టాపిక్ అవుతోంది. మంచి సినిమాలకు రేటింగ్స్ బావుంటే ప్రమోషన్స్ చేసుకునే వారు కొందరైతే.. తక్కువ రేటింగ్స్ ఇస్తే వైరల్ అయ్యే విధంగా కామెంట్స్ చేస్తుంటారు మరికొందరు. ప్రస్తుతం సినిమాలు విభిన్నంగా తెరకెక్కుతున్నాయి. అందులో చాలా వరకు రివ్యూలు కూడా విభిన్నంగా వస్తున్నాయి. ఇకపోతే రీసెంట్ గా దర్శకుడు తరుణ్ భాస్కర్ రివ్యూల గురించి కామెంట్స్ చేశాడు.

తరుణ్ భాస్కర్ లేటెస్ట్ ఫిల్మ్ ఈ నగరానికి ఏమైంది శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి, తెలిసిందే. అయితే టాక్ కూడా డిఫెరెంట్ గా ఉంది. ఇక రివ్యూల గురించి సోషల్ మీడియాలో కామెంట్స్ చేసిన ఈ యువ దర్శకుడు మళ్ళీ వెంటనే వెనక్కి తగ్గాడు. అయితే సక్సెస్ మీట్ లో తరుణ్ వివరణ ఇచ్చాడు. కొన్ని ప్రముఖ నేషనల్ మీడియాలో మంచి రేటింగ్స్ ఇచ్చాయని అందరికి సినిమా బాగా నచ్చిందని చెప్పాడు.

ఇక మరికొన్ని టాలీవుడ్ టాప్ వెబ్ సైట్స్ 2 రేంజ్ లో రేటింగ్ ఇచ్చినా తాను ఏమి ఫీల్ అవ్వలేదని చెప్పాడు. అయితే తన గత సినిమా రివ్యూల కారణంగానే మంచి సక్సెస్ అందుకుందని రివ్యూలను దృష్టిలో పెట్టుకొని కూడా నెక్స్ట్ సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పాడు. ఇక తాను వ్యక్తిగతంగా ఏ సైట్ పై నెగిటివ్ కామెంట్స్ చేయలేదని క్లారిటీ ఇచ్చాడు.