Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: తన సక్సెస్ లో భాగమైన ప్రతి ఒక్కరికీ 'థాంక్యూ' చెప్పాలనుకునే వ్యక్తి కథ..!

By:  Tupaki Desk   |   12 July 2022 5:04 PM GMT
ట్రైలర్ టాక్: తన సక్సెస్ లో భాగమైన ప్రతి ఒక్కరికీ థాంక్యూ చెప్పాలనుకునే వ్యక్తి కథ..!
X
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ''థ్యాంక్యూ''. ఇందులో రాశి ఖన్నా - మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటించగా.. అవికా గోర్ కీలక పాత్ర పోషించింది. రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

ఇప్పటికే 'థాంక్యూ' సినిమా నుంచి వచ్చిన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. 'మారో మారో' 'ఏంటో ఏంటేంటో' మరియు 'ఫేర్ వెల్' సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం మేకర్స్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. తన సక్సెస్ లో భాగమైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పాలనుకునే వ్యక్తి ప్రయాణాన్ని ఈ ట్రైలర్ చూపిస్తోంది.

'మనం ఎక్కడ మొదలయ్యామో మర్చిపోతే మనం చేరిన గమ్యానికి విలువ ఉండదని నా ఫ్రెండ్ చెప్పాడు' అని నాగచైతన్య చెప్పే డైలాగ్ తో 'థాంక్యూ' ట్రైలర్ ప్రారంభం అవుతుంది. హీరో జీవితంలోని మూడు దశలను ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అతని ప్రేమ, బాధ, కోపం, సంతోషం.. ఇలా అన్ని రకాల భావోద్వేగాలతో ఈ ట్రైలర్ ని కట్ చేశారు.

నాగచైతన్య స్కూల్ డేస్ లో మాళవిక నాయర్ తో ప్రేమను.. కాలేజ్ లో ఉన్నప్పుడు అన్న అంటూ అవికా గోర్ రాఖీ కట్టడం.. సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఎదిగే క్రమంలో రాశీ ఖన్నాతో ప్రేమాయణం వంటివి ఇందులో చూడొచ్చు. ముఖ్యంగా చైతూ ఈ సినిమాలో టీనేజ్ కుర్రాడిగా.. కాలేజ్ స్టూడెంట్ గా.. యారోగెంట్ బిజినెస్ మ్యాన్ గా మూడు విభిన్నమైన లుక్స్ లో క్లాస్ అండ్ మాస్ గెటప్స్ లో కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. దీంట్లో ప్రకాష్ రాజ్ - సుశాంత్ రెడ్డి కీలక పాత్రల్లో కనిపించారు.

'ఒక మనిషిని పట్టుకొని వేలాడే ప్రేమ కంటె స్వేచ్చగా వదిలేసే ప్రేమ గొప్పది' వంటి హృదయాన్ని హత్తుకునే డైలాగ్స్ ఈ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచాయి. ఎస్ఎస్ థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ప్లజెంట్ గా అనిపిస్తోంది. లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పి.సి శ్రీరామ్ విజువల్స్ ఆకర్షణీయంగా మరియు క్లాస్ గా ఉన్నాయి. మొత్తం మీద హీరో జీవితంలోని వివిధ దశలను చూపుతున్న ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

''థాంక్యూ'' చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు - శిరీష్ నిర్మించారు. బీవీఎస్ రవి కథ అందించగా.. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించారు. నవీన్ నూలి ఎడిటింగ్ వర్క్ చేశారు. జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. 'మనం' వంటి విజయవంతమైన సినిమా తర్వాత నాగచైతన్య - విక్రమ్ కుమార్ కాంబోలో రానున్న ఈ మూవీ ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.