Begin typing your search above and press return to search.

రేపే రిలీజ్ కానీ జీరో బ‌జ్ వుంది!

By:  Tupaki Desk   |   21 July 2022 1:17 PM GMT
రేపే రిలీజ్ కానీ జీరో బ‌జ్ వుంది!
X
టాలీవుడ్ ఆడియ‌న్ మైండ్ సెట్ మారింది. ప‌బ్లిసిటీ ఎంత చేసినా.. చేయ‌క‌పోయినా సినిమా బ‌జ్ ని బ‌ట్టే ఫ‌లితాన్ని జ‌డ్జ్ చేస్తున్నాడు. థియేట‌ర్ కి రావాలా? వ‌ద్దా అన్న‌ది కూడా డిసైడ్ చేస్తున్నాడు. గ‌త కొన్ని రోజులుగా టాలీవుడ్ స్టార్స్ సినిమాలు సంద‌డి చేసినా ప్ర‌స్తుతం మాత్రం టైర్ 2 హీరోల సినిమాలు మాత్రం ఆశించిన స్థాయిలో జ‌నాల‌ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌లేక‌పోతున్నాయి. కంటెంట్ ఓ కార‌ణంగా కాగా.. పెరిగిన టికెట్ రేట్లు మ‌రో కార‌ణంగా నిలుస్తున్నాయి.

ఇదిలా వుంటే శుక్ర‌వారం విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న `థాంక్యూ` సినిమాకు ఏమాత్రం బ‌జ్ లేక‌పోవ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మించిన సినిమా.. క్రేజీ స్టార్ నాగ‌చైత‌న్య‌, రాశీఖ‌న్నా క‌లిసి న‌టించిన మూవీ. అంతే కాకుండా `మ‌నం` ఫేమ్ విక్ర‌మ్ కె. కుమార్ డైరెక్ట్ చేసిన సినిమా రేపే రిలీజ్ అవుతున్న ఎక్క‌డ ఎలాంటి సంద‌డి క‌నిపించ‌డం లేదు.

సినిమా వ‌స్తున్న‌ట్టే ఎవ‌రూ గుర్తించ‌డం లేదు. ఇంత వ‌ర‌కు టికెట్ లు బుక్ మై షోలో మెజారిటీ స్థాయిలో బుక్ కాక‌పోవ‌డం షాక్ కు గురిచేస్తోంది. పేరున్న స్టార్, స్టార్ ప్రొడ్యూస‌ర్ నిర్మించిన సినిమాకు జీరో బ‌జ్ వుండ‌టం డేంజ‌ర్ బెల్స్ మోగిస్తోంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. పేరున్న వాళ్ల సినిమాకే ఇలాంటి ప‌రిస్థితి త‌లెత్తితే కొత్త వాళ్ల ప‌రిస్థితి ఏంటీ? అప్న‌ప‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

దీనికి తోడు నిర్మాత దిల్ రాజు హైద‌రాబాద్ లో త‌ప్ప ఏపీలో ప్రీమియ‌ర్ షోల‌ని ఏర్పాటు చేయడం కూడా ప‌లు అనుమానాల్ని రేకెత్తిస్తోంది. రిజ‌ల్ట్ తెలుసు కాబ‌ట్టే దిల్ రాజు హైద‌రాబాద్ లో ప్రీమియ‌ర్ షోల‌ని ఏర్పాటు చేయ‌డానికి భ‌య‌ప‌డుతున్నారా? అని కామెంట్ లు వినిపిస్తున్నాయి.

మొద‌టి నుంచి ఈ సినిమా విష‌యంలో నిర్మాత దిల్ రాజు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు ప‌లు అనుమానాల్ని రేకెత్తిస్తోంది. మ‌రి ఈ మూవీ విష‌యంలో త‌ప్పెక్క‌డ జ‌రిగింది? .. ఎందుకు మొద‌టి నుంచి ఈ మూవీకి బ‌జ్ క్రియేట్ కాలేదు? ..

క్లాస్ మూవీస్ ని, సోసోగా వుండే మూవీస్ ని ఈ రోజుల్లో ప్రేక్ష‌కుడు ఎంట‌ర్ టైన్ చేయ‌డం లేదు. అదే ఈ మూవీకి ప్ర‌ధాన బ‌ల‌హీన‌త‌గా మారిందా?.. లేక నిర్మాత ప్ర‌మోట్ చేయ‌డంలో పెద్ద‌గా ఆస‌క్తిని చూపించ‌క‌పోవ‌డం వ‌ల్లే ఈ ప‌రిస్థితి త‌లెత్తిందా? అని ట్రేడ్ వ‌ర్గాల‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కూడా ఆరాతీస్తున్నాయి.