Begin typing your search above and press return to search.

మళ్లీ మారిన 'థాంక్యూ' రిలీజ్ డేట్‌.. కొత్త తేదీ ఇదే

By:  Tupaki Desk   |   24 Jun 2022 12:26 PM GMT
మళ్లీ మారిన థాంక్యూ రిలీజ్ డేట్‌.. కొత్త తేదీ ఇదే
X
అక్కినేని నాగచైతన్య.. రాశి ఖన్నా జంటగా నటించిన సినిమా " థాంక్యూ". శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై సక్సెస్ ఫుల్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించారు.

"మనం" లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ను నాగ చైతన్య కు అందించిన దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఈ సినిమా ను రూపొందిస్తున్నారు. రాశీ ఖన్నా తో పాటు ఈ సినిమా లో మాళవిక నాయర్ ఇంకా అవికా గౌర్‌ లు హీరోయిన్స్‌గా నటించారు.

ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల అయిన టీజర్ సినిమా పై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేయగా రెండు పాటలు కూడా మంచి సక్సెస్ ను దక్కించుకుని సినిమా పై అంచనాలు పెంచాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. టీజర్ తో పాటు రిలీజ్ చేసిన రెండు పాటలు హిట్ అవడంతో "థాంక్యూ" సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగాయి.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో రెండు మూడు సార్లు ఈ సినిమా విడుదల చేయాలనుకుని వాయిదా వేయడం జరిగింది. ఇటీవల "థాంక్యూ" సినిమా ను జూలై 8న విడుదల చేయాలని అనుకున్నారు. తాజాగా మళ్లీ రిలీజ్ డేట్ ను జూలై 22 తేదీకి మార్చారు.

కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడ్డ ఈ సినిమా ను అన్ని కమర్షియల్ హంగులతో జూలై 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. కొత్త విడుదల తేదీ విషయమై తాజాగా నిర్ణయం తీసుకున్నట్లుగా నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

లెజండరీ సినిమాటోగ్రాఫర్‌ పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. బీవీఎస్ రవి కథను అందించారు. నాగ చైతన్య కెరీర్ లో " థాంక్యూ" ఒక స్పెషల్ మూవీ గా నిలుస్తుందని చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంతో ఉన్నారు. ఈ సారి విడుదల తేదీ విషయంలో కచ్చితంగా మార్పు ఉండదని నమ్మకంగా ఉన్నారు.