Begin typing your search above and press return to search.

#థాంక్యూ.. హైదరాబాద్ లో ముగించి ఇటలీకి పయ‌నం

By:  Tupaki Desk   |   11 April 2021 11:30 PM GMT
#థాంక్యూ.. హైదరాబాద్ లో ముగించి ఇటలీకి పయ‌నం
X
మనం దర్శకుడు విక్రమ్ కుమార్ తో కలిసి నాగచైత‌న్య‌ ఫ్యామిలీ ఎంటర్ టైన‌ర్ థాంక్యూ కోసం రిగ‌ర‌స్ గా ప‌ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. స్పోర్ట్స్ బ్యాక్ ‌డ్రాప్ నేప‌థ్యం ఉన్న‌ ఈ చిత్రంలో చైతూ మహేష్ బాబు అభిమానిగా కనిపించనున్నారు.

హైదరాబాద్ ప‌రిస‌రాల్లోనే థాంక్యూ చిత్రాన్ని మెజారిటీ భాగం తెర‌కెక్కిస్తున్నారు. త‌దుప‌రి యూనిట్ కొన్ని కీలకమైన సన్నివేశాలు పాటల చిత్రీక‌ర‌ణ కోసం ఇటలీకి వెళ్ల‌నున్నార‌ని తెలిసింది. ఇటలీ షెడ్యూల్ ‌తో టాకీ పాట‌ల చిత్ర‌ణ‌ మొత్తం పూర్త‌వుతుంది.

ఈ చిత్రంలో రాశి ఖన్నా క‌థానాయిక‌. మాలవికా నాయర్- అవికా గోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2021 ద్వితీయార్థంలో రిలీజ‌వుతుంది.