Begin typing your search above and press return to search.

బాలీవుడ్‌ భారీ చిత్రంపై తెలుగు సినిమా ప్లాప్‌ ఎఫెక్ట్‌ !

By:  Tupaki Desk   |   30 July 2022 3:30 AM GMT
బాలీవుడ్‌ భారీ చిత్రంపై తెలుగు సినిమా ప్లాప్‌ ఎఫెక్ట్‌ !
X
టాలీవుడ్‌ హీరోలు బాలీవుడ్‌ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాయి. ఇదే సమయంలో బాలీవుడ్‌ సినిమాలను కూడా సౌత్‌ లో ఆడించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ పెద్ద హీరోల సినిమాలకు ఏదో ఒక సమస్య వచ్చి చివరి నిమిషంలో ఇక్కడ వసూళ్ళ పరంగా నిరాశ పర్చుతున్నాయి. ప్రస్తుతం అందరి దృష్టి బాలీవుడ్ సూపర్ స్టార్‌ ఆమీర్ ఖాన్‌ తాజా చిత్రం 'లాల్‌ సింగ్‌ చద్దా' పై ఉంది.

హిందీలో డౌట్ లేకుండా లాల్ సింగ్ చద్దా భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ఫలితం ఎలా ఉన్నా కూడా సినిమాకు మినిమం గా ఓపెనింగ్స్ ఉండే అవకాశం ఉంది. సినిమా ఫలితాన్ని లాంగ్ రన్‌ లో కలెక్షన్స్ ఉంటాయి అంటున్నారు. లాల్‌ సింగ్‌ చద్దాను సౌత్‌ లో జనాల వద్దకు తీసుకు వెళ్లడం కోసం సౌత్‌ స్టార్స్ అయిన నాగ చైతన్య మరియు విజయ్‌ సేతుపతిని నటింపజేశారు.

వీరిద్దరు ఉండటం వల్ల లాల్ సింగ్ చద్దా కు తెలుగు మరియు తమిళంలో మంచి పబ్లిసిటీ అయితే దక్కింది. కాని లాల్‌ సింగ్‌ చద్దా లో నటించిన నాగ చైతన్య తాజా చిత్రం థాంక్యూ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. మరీ దారుణమైన వసూళ్లు నమోదు అవ్వడంతో నాగ చైతన్య సెలక్షన్‌ పై విమర్శలు వస్తున్నాయి.

ఈ సమయంలో ఆయన నటించిన లాల్ సింగ్‌ చద్దా రాబోతుంది.. చూద్దాం అనుకునే వారు ఎంత మంది ఉంటారు అనేది అనుమానమే. సినిమా విడుదల అయిన తర్వాత పాజిటివ్ టాక్‌ వస్తే తప్పకుండా అప్పుడు తెలుగు బాక్సాఫీస్ వద్ద కూడా హడావిడి కనిపించే అవకాశం ఉంది.

ప్రస్తుతానికి మాత్రం తెలుగు సినిమా థాంక్యూ ఫ్లాప్‌ అనేది బాలీవుడ్‌ భారీ చిత్రం లాల్‌ సింగ్ చద్దా పై తీవ్రంగా చూపించే అవకాశాలు ఉన్నాయి.

కొందరు మాత్రం నాగ చైతన్య ఈ సినిమా లో గెస్ట్‌ రోల్‌ మాత్రమే. కనుక సినిమాకు వచ్చిన నష్టం లేదని.. ఈ సినిమా ను మెగా స్టార్‌ సమర్పిస్తున్నారు కనుక భారీగానే ఓపెనింగ్స్ ఉంటాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 11వ తారీకు రాబోతున్న ఈ సినిమా ఆమీర్ ఖాన్ కు కమర్షియల్‌ గా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది చూడాలి.