Begin typing your search above and press return to search.

అటకెక్కిన తనీ ఒరువున్ రీమేక్

By:  Tupaki Desk   |   5 Feb 2016 1:00 AM IST
అటకెక్కిన తనీ ఒరువున్ రీమేక్
X
కోలీవుడ్ మూవీ తనీ ఒరువన్ రీమేక్ రద్దయిందనే హెడ్డింగ్ కరెక్టే కానీ.. ఇది రామ్ చరణ్ చేస్తున్న రీమేక్ సంగతి కాదులెండి. బాలీవుడ్ లో తనీ ఒరువన్ సంగతి. చెర్రీ ఈ రీమేక్ పనులను చకచకా చక్కబెట్టేస్తున్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో త్వరలో షూటింగ్ కూడా స్టార్ట్ చేసేయనున్నాడు. కోలీవుడ్ లో తని ఒరువన్ బ్లాక్ బస్టర్ కొట్టగానే.. అనేక భాషల నుంచి రీమేక్ ఎంక్వైరీలు వచ్చాయి. అందులో తెలుగుతో పాటు హిందీ కూడా ఉంది.

తని ఒరువన్ ని హిందీలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఒరిజినల్ లో జయం రవి పోషించిన పవర్ఫుల్ రోల్ ని సల్మాన్ తో చేయించేందుకు మాటామంతీ చేపట్టారు. సల్లూ భాయ్ కూడా సినిమా తెగ నచ్చేసిందని చెప్పాడు. దీంతో తని ఒరవన్ ని డైరెక్ట్ చేసిన మోహన్ రాజా.. హిందీ వెర్షన్ కి కూడా దర్శకత్వం వహించేందుకు సిద్ధమయ్యాడు. కానీ ఈ ప్రాసెస్ ఎంతకీ తెగకపోవడంతో.. ఈ దర్శకుడికి విసుగొచ్చేసింది.

మరోవైపు సల్మాన్ కూడా ఈ మూవీలో ఎంటర్ టెయిన్ మెంట్ తక్కువగా ఉండడంతో.. తన ఇమేజ్ కు సూటవదని భావిస్తున్నాడు. సినిమాలో ఎటువంటి ట్రాక్స్ మిక్స్ చేసే ఛాన్స్ లేకపోవడంతో సల్మాన్ ఖాన్ ఈ రోల్ చేసేందుకు సిద్ధంగా లేడట. ఈ విషయం తెలిసిన మోహన్ రాజా.. ఇప్పటికే తన దగ్గర మరో రెండు స్క్రిప్ట్స్ సిద్ధంగా ఉన్నాయని చెప్పేశాడు. దీంతో తని ఒరువన్ హిందీ రీమేక్ అటకెక్కేసిందని బాలీవుడ్ జనాలు అంటున్నారు.