Begin typing your search above and press return to search.
లేటెస్ట్ క్లిక్: భీమ్లానాయక్ తో తమన్ - త్రివిక్రమ్..!
By: Tupaki Desk | 28 July 2021 10:00 PM ISTసౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనగుతున్న థమన్.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' తెలుగు రీమేక్ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ లను థమన్ కలిసినట్లు తెలుస్తోంది.
థమన్ సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ లతో కలిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేశారు. ''శక్తి మరియు ఆనందం.. భీమ్లానాయక్ మాస్. నా ప్రియమైన దర్శకుడు త్రివిక్రమ్ గారు & మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు!!'' అని దీనికి క్యాప్సన్ పెట్టాడు. ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో పవన్ ఎప్పటిలాగే సింపుల్ గా పంచె కట్టులో ఉండగా.. తమన్ - త్రివిక్రమ్ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో ఉన్నారు. పవర్ స్టార్ అభిమానులు ఈ ఫోటోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రానికి సంగీతం అందించాలనే కోరికను 'వకీల్ సాబ్' తో తీర్చుకున్నాడు ఎస్ ఎస్ థమన్. 'గబ్బర్ సింగ్' చిత్రాన్ని మిస్ చేసుకున్న తమన్.. ఇన్నేళ్లకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. పవన్ కోసం అద్భుతమైన మ్యూజిక్ అల్బమ్ అందించి సినిమా సక్సెస్ లో కీ రోల్ పోషించాడు. అయితే ఈ ఛాన్స్ రావడానికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కారణమని తమన్ పలు సందర్భాల్లో వెల్లడించారు.
త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన 'అరవింద సమేత వీర రాఘవ' 'అల వైకుంఠపురములో' చిత్రాలను థమన్ సంగీతం సమకూర్చిన సంగతి తెలిసిందే. రెండు చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ఇచ్చిన థమన్ ను తన సన్నిహితుడు పవన్ కళ్యాణ్ కు పరిచయం చేశాడు. ఈ క్రమంలోనే దిల్ రాజు తో మాట్లాడించి 'వకీల్ సాబ్' ఆఫర్ థమన్ కు వచ్చేలా చేసాడు త్రివిక్రమ్. ఇప్పుడు 'ఏకే' తెలుగు రీమేక్ కు థమన్ మ్యూజిక్ అందించడం వెనుక కూడా త్రివిక్రమ్ ఉన్నాడనే సంగతి తెలిసిందే.
సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న #PSPKRana చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మల్టీస్టారర్ ప్రాజెక్ట్ లోకి థమన్ వచ్చి చేరాడని తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ ఇందులో భీమ్లానాయక్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. 2022 సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.