Begin typing your search above and press return to search.

19 ఏళ్లు.. మళ్లీ గుర్తు చేసుకున్న థమన్‌

By:  Tupaki Desk   |   30 Aug 2022 10:28 AM IST
19 ఏళ్లు.. మళ్లీ గుర్తు చేసుకున్న థమన్‌
X
సౌత్ స్టార్‌ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కెరీర్‌ ఆరంభంలో శంకర్ దర్శకత్వంలో రూపొందిన బాయ్స్ సినిమాలో నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమా అప్పట్లో ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమా అప్పటి యూత్ ఆడియన్స్‌ కి ఒక అద్భుతం అన్నట్లుగా థియేటర్లలో ఆడింది. ఇప్పటికి కూడా బాయ్స్ సినిమా టీవీల్లో మంచి రేటింగ్ ను దక్కించుకుంటుంది.

ఆ సినిమా విడుదల అయ్యి 19 ఏళ్లు అయిన సందర్భంగా థమన్ పాత జ్ఞాపకాల్లోకి వెళ్లాడు. 90 కిడ్స్ కి ఒక వ్యామోహం మాదిరిగా బాయ్స్ సినిమా అప్పట్లో నిలిచిందని.. బాయ్స్ సినిమా కి 19 ఏళ్లు అంటూ సోషల్ మీడియా ద్వారా తన యొక్క జ్ఞాపకాలను థమన్‌ షేర్ చేసుకున్నాడు. ఆ సినిమాలో థమన్‌ తో పాటు ఇంకా పలువురు హీరోలు నటించారు.

థమన్‌ బాయ్స్ సినిమా సమయంలో ఎవ్వరికి తెలియదు.. కానీ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆయన పాటలు కుమ్మేస్తున్నాయి. అల వైకుంఠపురంలో సినిమా అంతర్జాతీయ స్థాయిలో ట్రెండ్‌ అయిన విషయం తెల్సిందే. అలాంటి థమన్‌ సంగీత దర్శకుడిగా ఇప్పుడు సౌత్ లోనే టాప్‌ లో ఉన్నాడు. అత్యధిక పారితోషికం తీసుకుంటున్న సంగీత దర్శకుడిగా టాప్‌ ప్లేస్ లో ఉన్నాడు.

బాయ్స్ సినిమాలో నటుడిగా నటించి మెప్పించిన థమన్ మళ్లీ సినిమాల్లో నటించే అవకాశాలు వచ్చినా కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు.

పూర్తిగా సంగీతం పై దృష్టి పెట్టాడు కనుక ఇప్పుడు సంగీత దర్శకుడిగా ఇండియాలోనే టాప్‌ ప్లేస్‌ లో ఉన్నాడు అనడంలో సందేహం లేదు. నటనపై డాన్స్ పై అభిరుచి ఉండటంతో లిరికల్‌ వీడియోల్లో తన యొక్క ప్రతిభను చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.