Begin typing your search above and press return to search.
ఈ దాగుడుమూతల కిక్ ఏంటో?
By: Tupaki Desk | 11 Jun 2015 1:23 PM IST''రేపు ఉదయం 11 గంటలకు కిక్ ఇచ్చే ట్వీట్.. ఎదురు చూస్తూ ఉండండి''.. మొన్న రాత్రి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చేసిన ట్వీట్ ఇది. కచ్చితంగా కిక్-2 రిలీజ్ డేట్ గురించి అనౌన్స్‌మెంట్ రాబోతోందని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. 11 గంటల సమయం వచ్చింది, వెళ్లిపోయింది. కాసేపటి తర్వాత.. ''బ్యాగ్రౌండ్ స్కోర్ వర్క్ పూర్తి కావస్తోంది. కాసేపట్లో మా డైరెక్టర్ సురేందర్‌రెడ్డి సూపర్ కూల్ వీడియో ఒకటి రాబోతోంది. రెడీగా ఉండండి'' అంటూ ఇంకో ట్వీట్ చేశాడు తమన్. కానీ రోజు గడిచిపోయింది. ఏ వీడియోనూ రిలీజ్ చేయలేదు.
కిక్-2 సినిమాను డాల్బీ అట్మాస్ టెక్నాలజీలో రిలీజ్ చేయబోతున్నారని.. 1 నేనొక్కడినే, రేసుగుర్రం తర్వాత ఆ టెక్నాలజీలో రిలీజవుతున్న తెలుగు సినిమా కిక్-2 మాత్రమే అన్న కబురు మాత్రం చెప్పారు. ఈ సంగతి చెప్పడానికే తమన్ ఊరించాడని అనుకోవడానికేమీ లేదు. నిజానికి ఈ నెల 17న కిక్-2 రిలీజ్ చేసేయాలని ఒక సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారని.. అది చెప్పడానికి రెడీ అయ్యారని.. కానీ మరీ ఇంత హడావుడిగా రిలీజ్ అంటే కష్టమని వెనక్కి తగ్గారని కిక్-2 యూనిట్ సభ్యుల సమాచారం. మొత్తానికి కిక్-2 విడుదలకు సంబంధించి సాగుతున్న దాగుడుమూతలు జనాల్లో ఫ్రస్టేషన్ పెంచుతున్నాయి. అసలే సమ్మర్ సీజన్ కిక్కిచ్చే సినిమాలు లేక జనాలు నీరసించి పోయి ఉన్నారు. ఇప్పుడైనా కిక్-2 లాంటి క్రేజీ మూవీ జనాల ముందుకు వస్తుందేమో అని ఎదురు చూస్తుంటే ఏదో ఒక కారణంతో వెనక్కి తోసుకెళ్లిపోతున్నారు.