Begin typing your search above and press return to search.
థమన్ లో కొత్త ఆలోచన కలిగించిన వైరల్ వీడియో
By: Tupaki Desk | 26 April 2021 6:32 AM GMTసోషల్ మీడియాలో రెగ్యులర్ గా థమన్ ఏదో ఒక విషయమై పోస్ట్ లు పెడుతూనే ఉంటాడు. తన సినిమాల గురించి మాత్రమే కాకుండా సామాజిక విషయాల గురించి కూడా స్పందిస్తూ నలుగురిలో ఆలోచన కలిగించేలా చేస్తూ ఉంటాడు. థమన్ ను ట్విట్టర్ లో ఫాలో అవుతున్న వారు దాదాపుగా 1.7 మిలియన్ ల మంది ఉన్నారు. తన ఫాలోవర్స్ తో థమన్ ప్రతి రోజు ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటాడు. తాజాగా థమన్ ఒక వైరల్ వీడియోను రీ ట్వీట్ చేసి అందరి హృదయాలను కదిలించాడు. ఆ వీడియోలో ఒక వృద్దురాలు ఆకలితో అలమటిస్తూ ఆహారం లభించగానే కన్నీరు పెట్టుకోవడంను చూడవచ్చు. ఆ వీడియో థమన్ ను కదిలించిందట.
ట్విట్టర్ లో థమన్ ఆ వీడియోను షేర్ చేసి నా గుండె పగిలి పోయిందన్నాడు. ఈ వీడియో చూసిన తర్వాత తనకు ఒక అనాధ ఆశ్రమంను కట్టాలనే కల మొదలు అయ్యిందని పేర్కొన్నాడు. నేను త్వరలోనే ఒక ఓల్డేజ్ హోమ్ ను మొదలు పెడతానంటూ ప్రకటించాడు. నేను కొంత మంది కన్నీరు అయినా తూడ్చాలనుకుంటున్నాను. దయచేసి ఎవరు కూడా ఫుడ్ ను వృదా చేయవద్దని, అవసరం ఉన్న వారికి ఇవ్వాలంటూ థమన్ పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరు కూడా మానవత్వంతో వ్యవహరించాలని కోరాడు.
థమన్ ప్రస్తుతం టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లో టాప్ మ్యూజిక్ కంపోజర్ గా దూసుకు పోతున్నాడు. స్టార్ లకు సూపర్ స్టార్ లకు మోస్ట్ వాంటెడ్ గా థమన్ నిలిచాడు. అలాంటి థమన్ సోషల్ మీడియాలో ఇలాంటి ఒక మంచి మెసేజ్ ను ఇవ్వడం.. వృద్దుల కోసం ఓల్డ్ ఏజ్ హోమ్ ను ఏర్పాటు చేస్తానంటూ ప్రకటించడం నిజంగా అభినందించాల్సిన విషయం అంటూ థమన్ అభిమానులు నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు.

இந்தா காசு வாங்கிக்கப்பா...
— சிந்தனைவாதி
# ஒரு முதியோருக்கு உதவுவது ஆயிரம் கடவுள்களின் வரம் pic.twitter.com/xWlJei82Iz