Begin typing your search above and press return to search.

అర్ధరాత్రి తమన్ ‘పవర్’ బాంబు పేల్చాడు

By:  Tupaki Desk   |   8 Nov 2016 9:41 AM IST
అర్ధరాత్రి తమన్ ‘పవర్’ బాంబు పేల్చాడు
X
అర్ధరాత్రి వేళ అందరికీ పెద్ద షాకే ఇచ్చాడు తమన్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ తర్వాతి సినిమాకు తానే సంగీత దర్శకుడినంటూ సోమవారం అర్ధరాత్రి దాటాక అతను ఆశ్చర్యకర ప్రకటన చేశాడు. తమిళ డైరెక్టర్ టీఎన్ నీశన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. ఎ.ఎం.రత్నం నిర్మించే ఈ చిత్రం దసరాకు ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. ఈ చిత్రానికి తనే సంగీత దర్శకుడినంటూ చాలా ఎగ్జైట్ అయిపోతూ చెప్పాడు తమన్. ఐతే ఉదయమో.. సాయంత్రమో చెబితే తమన్ హాట్ టాపిక్ అయ్యేవాడు కానీ.. ఎందుకో అర్ధరాత్రి ముహూర్తాన్ని ఎంచుకున్నాడు కుర్రాడు.

రవితేజ లాంటి స్టార్ హీరోతో ‘కిక్’ సినిమా ద్వారా తెలుగులో తన సంగీత ప్రయాణాన్ని ఆరంభించిన తమన్.. కెరీర్ ఆరంభంలోనే చాలామంది స్టార్ హీరోలతో పని చేశాడు. మహేష్ బాబుతో కూడా చాలా త్వరగానే అవకాశం దక్కించుకున్నాడు కానీ.. పవన్ తో సినిమా చేయడానికే చాలా ఆలస్యమైంది. అనూప్ రూబెన్స్ లాంటి సంగీత దర్శకులకు కూడా ఛాన్సిచ్చిన పవన్.. తమన్ మీద శీతకన్నేశాడు. ఐతే ఎట్టకేలకు అతడికి అవకాశం దక్కింది. మరి పవన్ కోసం తమన్ ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో చూడాలి. ఈ సినిమా మొదలవడానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి.. తమన్ ఎప్పట్లా హడావుడి పడకుండా బాగా టైం తీసుకుని పవన్ కోసం ఒక మెమొరబుల్ ఆల్బం ఇస్తాడేమో చూద్దాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/