Begin typing your search above and press return to search.

తమిళ కంపోజర్ కాదు.. థమనే

By:  Tupaki Desk   |   17 Feb 2018 3:05 PM IST
తమిళ కంపోజర్ కాదు.. థమనే
X
జూనియర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో జోరు మీద ఉన్నాడు. జై లవ కుశ తో హిట్ అందుకున్న తర్వాత ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా తారాగణం మరియు టెక్నిషన్స్ ను ఎంచుకుంటున్న ఈ తరుణంలో మ్యూజిక్ డైరెక్టర్ ను మార్చడం అందరిని షాక్ కి గురి చేసింది.

అనిరుద్ కోలీవుడ్ లో ఒక సెన్సేషనల్ కంపోజర్. అతని ముసిచ్ బాగా నచ్చేసి - త్రివిక్రమ్ అతనిని అజ్ఞాతవాసి సినిమా తో టాలీవుడ్ కు పరిచయం చేశాడు. ఎన్టీఆర్ సినిమా లో ఇతనితోనే మ్యూజిక్ చేయించాలని అనుకున్నాడు. మూవీ లాంచ్ లో కూడా అనిరుధ్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా అనౌన్స్ చేశారు. కానీ అజ్ఞాతవాసి సినిమా ఎంత పెద్ద డిసాస్టర్ అయిందో అందరికి తెలుసు. అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ కూడా సినిమా ప్లాప్ అవ్వడానికి ఒక పెద్ద కారణం అని అంటున్నారు నెటిజన్లు. దీనితో ఎన్టీఆర్ ఫాన్స్ అంతా త్రివిక్రమ్ మీద ప్రెషర్ తెచ్చారు. ప్లాప్ కంపోజర్ తో మా హీరో సినిమా చేయడానికి వీల్లేదు అని బలంగా చెప్పేసారికి త్రివిక్రమ్ కూడా మనసు మార్చుకున్నారు.

అనిరుధ్ ని తీసేసి - తొలి ప్రేమ తో సూపర్ హిట్ అందుకున్న థమన్ ను తీసుకోవడం జరిగింది. ఎన్టీఆర్ కూడా ఒప్పుకోవడంతో థమన్ ఇపుడు ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా కి స్వరాలు కూర్చే పనిలో పడ్డాడు. ఫాన్స్ కూడా ఖుష్ అయ్యారు. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ ఎన్టీఆర్ తో జత కట్టబోతోంది.