Begin typing your search above and press return to search.

విమ‌ర్శ‌కుల‌కు థ‌మ‌న్ స‌మాధానం ఇలానా?

By:  Tupaki Desk   |   3 April 2021 6:30 AM GMT
విమ‌ర్శ‌కుల‌కు థ‌మ‌న్ స‌మాధానం ఇలానా?
X
త‌న పాట‌ల్ని తానే కాపీ కొడ‌తాడ‌ని మ్యూజిక్ ఎంత‌మాత్రం కొత్త‌గా లేద‌ని థ‌మ‌న్ పై విమ‌ర్శ‌లున్నాయి. అయితే త‌న‌ని విమ‌ర్శించేవాళ్ల‌పై థ‌మ‌న్ కూడా ప్ర‌తిసారీ అంతే ధీటుగా పంచ్ లు వేస్తుంటారు. తాను బ్లాక్ బ‌స్ట‌ర్ల‌కు ప‌ని చేసాన‌ని త‌న‌నే అంద‌రూ కావాల‌నుకోవ‌డం వెన‌క కార‌ణ‌మేమిటో గ్ర‌హించాల‌ని కూడా థ‌మ‌న్ గ‌తంలో అన్నారు.

ఇక త‌న‌పై వ‌చ్చే విమ‌ర్శ‌ల‌న్నిటికీ 2020 సంక్రాంతి చార్ట్ బ‌స్ట‌ర్ అల వైకుంఠ‌పుర‌ములో పాట‌ల రూపంలో స‌మాధాన‌మిచ్చేసిన థ‌మ‌న్ .. దానికి కొన‌సాగింపుగా అర‌డ‌జ‌ను పైగానే స్టార్ హీరోల సినిమాల‌కు క‌మిట‌య్యారు.

తాజాగా థ‌మ‌న్ సంగీతం అందించిన వైల్డ్ డాగ్ రిలీజైంది. ఈ సినిమాలో పాట‌లు లేక‌పోయినా కానీ థ‌మ‌న్ రీరికార్డింగ్ బీజీఎం అద్భుతంగా ఉన్నాయ‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. పాట‌ల్లేకపోయినా ఆర్.ఆర్ విష‌యంలో థ‌మ‌న్ ని పొగిడేవాళ్లు క‌నిపిస్తున్నారు. ఎన్.ఐ.ఏ - తీవ్ర‌వాద ఆప‌రేష‌న్ నేప‌థ్యంలో సీరియ‌స్ డ్రామాతో సాగిన సినిమా ఆద్యంతం రీరికార్డింగ్ ప‌నిత‌నమే క‌నిపిస్తోంద‌న్న ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అయితే ఇలా థ‌మ‌న్ ని అంద‌రూ గుర్తు చేయ‌డ‌మే గ‌త ప్ర‌శ్న‌ల‌న్నిటికీ స‌మాధానం అనుకోవాలి.

ఈ సినిమాతో పాటు ఏప్రిల్ 9న విడుద‌ల‌వుతున్న వ‌కీల్ సాబ్ కి థ‌మ‌న్ సంగీతం అందించాడు. మ‌హేష్‌ - సర్కార్ వారి పాట‌.. అయ్యప్పనమ్ కోషియం రీమేక్ కి థ‌మ‌న్ ప‌ని చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గానే సంచ‌ల‌నాల స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ తో రామ్ చ‌ర‌ణ్ సినిమాకి థ‌మ‌న్ క‌మిట‌వ్వ‌డం మ‌రో సెన్సేష‌న్ అనే చెప్పాలి. మ‌రోవైపు త‌మిళం క‌న్న‌డ‌లోనూ స్టార్ హీరోల‌కు మాత్ర‌మే థ‌మ‌న్ క‌మిట‌వుతుండ‌డం విశేషం. ఈ ట్రాక్ రికార్డ్ చూస్తుంటే.. విమ‌ర్శ‌కుల‌కు ఇంత‌కుమించిన ప్రాక్టిక‌ల్ జవాబు అవ‌స‌రం లేద‌నే భావించాలి.